బ్యాంక్ ఉద్యోగిగా టీమిండియా స్టార్ క్రికెటర్.. జీతం ఎంతో తెలుసా?
Ishan Kishan: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది కాలంగా భారత జట్టులో పటిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇషాన్ కిషన్ ఇటీవల స్టేడియంలోనే కాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ వార్తల్లో నిలిచాడు. ఇషాన్ కిషన్ తాజాగా ఆర్బీఐ బ్యాంకుల్లో పనిచేస్తున్నట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇటీవల టీ20 మ్యాచ్‌లకు స్వల్ప విరామం లభించడంతో ఇషాన్ కిషన్ తన ఉద్యోగ బాధ్యతలను కూడా బాధ్యతాయుతంగా పూర్తి చేయడం అభిమానులను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. బ్యాంకులో కొంత మంది సిబ్బందితో కలిసి పని చేస్తూ ఇషాన్ కిషన్ ఆ ఫోటోల్లో కనిపించాడు. ఇషాన్ కిషన్ మెడలో ఆర్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఐడీ కార్డు ఉండడం విశేషం.
భారత స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ స్పోర్ట్స్ కోటా కింద ఆర్బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ బీహార్ రాజధాని పాట్నాలోని ఆర్బీఐ రీజనల్ కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బ్యాంకులో ఇషాన్ కిషన్ కనిపించడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇతర సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఇషాన్ కిషన్ తో కలిసి ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులతో కలిసి ఇషాన్ కిషన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఇషాన్ కిషన్ నిబద్ధతను అభినందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బిజీ క్రికెట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. సమయం దొరికినప్పుడు ఉద్యోగానికి హాజరుకావడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఇషాన్ కిషన్ జీతం ఎంతంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేసే ఉద్యోగుల జీతం సుమారు 1.22 లక్షల నుంచి 1.24 లక్షల వరకు ఉంటుంది. ట్యాక్సులు, పీఎఫ్ అలాగే ఇతర కటింగ్స్ పోను ప్రతినెలా నికర జీతం 1.08 లక్షల నుంచి 1.12 లక్షలకు చేతికి వస్తాయని తెలుస్తోంది. టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు కాబట్టి.. ఆయనకు కూడా 1.08 లక్షల నుంచి 1.12 లక్షల వరకు వేతనం లభించనుంది.
Ishan Kishan at Reserve Bank of India Patna 🔥
— Johns. (@CricCrazyJohns) August 5, 2026
- Cricket off season, Banking job for Ishan. pic.twitter.com/ayrq1Chybq














Click it and Unblock the Notifications