Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 68,754 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,569 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.68 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది.

తిరుమల శ్రీవారి దర్శన క్యూలైన్‌లో టీటీడీ, అధికారులకు వ్యతిరేకంగా ఓ భక్తుడు నినాదాలు చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నారాయణగిరి షెడ్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్యూ లైన్ గుండా శ్రీవారి దర్శనానికి వెళ్తోన్న ఆ భక్తుడు టీటీడీకి వ్యతిరేకంగా తాను నినాదాలు చేయడంతో పాటు తోటి భక్తులను కూడా అందుకు ప్రేరేపించడం ఈ వీడియోలో రికార్డయింది.

TTD Appeals for Patience as Devotee Admits Mistake as He raising slogans in Narayanagiri Queue line

అతన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అనుపోజు వీర నవీన్‌ గా గుర్తించారు. ఈ విషయం టీటీడీ అధికారుల దృష్టికి చేరింది. దీంతో అధికారులు నవీన్ ను పిలిపించి మాట్లాడారు. దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం పట్ల గల కారణాలను గురించి ఆరా తీశారు. అలా నినాదాలు చేయడం ముమ్మాటికీ తప్పేనని నవీన్ ఒప్పుకొన్నాడు. ఇందుకు టీటీడీ, శ్రీవారి భక్తులకు అతను క్షమాపణలు తెలిపాడు.

ఈ నేపథ్యంలో టీటీడీ తాజాగా భక్తులకు తాజా అప్పీల్ చేసింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో క్యూ లైన్ లో గానీ, కంపార్ట్ మెంట్లల్లో గానీ తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఓపిగ్గా వేచి ఉండాలని సూచించింది. టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

మరోవంక- వేసవిలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి అన్నప్రసాదం, మంచినీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేయాలని నిర్ణయించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయనున్నారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+