హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్

హైదరాబాద్.. క్రమంగా రైల్వే హబ్ గా మారుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడకు ప్రత్యామ్నాయంగా పలు రైల్వే స్టేషన్లు రూపుదిద్దుకుంటోన్నాయి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి.. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు సేవలను అందిస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి సైతం ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందుతున్నాయి. వందలాది రైళ్లకు గమ్యస్థానంగా కొనసాగుతున్నాయి.

వీటితో పాటు హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇతర చిన్న రైల్వే స్టేషన్లన్నీ కూడా అత్యాధునికంగా తయారవుతున్నాయి. ఇందులో ఒకటి- హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌. దీని ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపుగా పూర్తయ్యాయి. చర్లపల్లి తరహాలో ఇప్పుడున్న వాటి కంటే అదనపు రైలు సర్వీసులు ఇక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పనుల పురోగతిని కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే వివరించారు.

Renovated Hafizpet Railway Station to Deliver State-of-the-Art Passenger Amenities with New FOB

అమృత్ భారత్ కింద తెలంగాణలో పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్.. వంటి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర.. వంటి రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ.

ఇప్పటికే సికింద్రాబాద్, యాదాద్రి, బేగంపేట్ వంటి రైల్వే స్టేషన్ల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి కూడా. 718 కోట్ల రూపాయల వ్యయంతో సికింద్రాబాద్ అభివృద్ధి పనులను చేపట్టారు. మూడు దశల్లో ఇవి పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మితం కానుంది. ఇప్పుడిదే జాబితాలో హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ చేరింది. 29.21 కోట్ల రూపాయల వ్యయంతో దీని పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఇప్పటివరకు 92 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. రాంప్‌తో సహా 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, కవర్ ఓవర్ ప్లాట్‌ఫామ్, ఆధునిక టాయిలెట్లు, స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ఏరియా, ప్లాట్‌ఫామ్ రీసర్ఫేసింగ్ పూర్తయ్యాయి. సైన్‌బోర్డులు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు పనులు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+