సమంతకు ప్రెగ్నెన్సీ.. ఆ సీక్రెట్ దాచడానికే అలా చేసిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు వరుసగా వార్తల్లో నిలుస్తోంది. సమంత ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' జూన్ 19న(నేడే) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో సమంత చేసిన యాక్షన్ సీన్స్, నటనపై సోషల్ మీడియాలో ప్రేక్షకులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత సమంత తన ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ వేసుకుందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అయితే ఓవైపు సినిమా హిట్ అంటూ టాక్ నడుస్తుండగానే.. మరోవైపు సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. సమంత త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోందని.. ఆమె ప్రస్తుత ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట భారీగా ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ప్రమోషన్ల సమయంలో సమంతను చూసిన కొందరు నెటిజన్లు, ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు కనిపిస్తోందంటూ కామెంట్లు పెట్టడంతో ఈ పుకార్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

Samantha Pregnancy Rumors go viral Is That the Secret Behind Her Saree Looks Full Details

ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం సమంత ఎంచుకున్న కాస్ట్యూమ్స్ ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. గ్లామర్ ప్రపంచంలో సాధారణంగా హీరోయిన్లు మోడరన్ దుస్తుల్లో ప్రమోషన్లకు వస్తుంటారు. కానీ సమంత మాత్రం 'మా ఇంటి బంగారం' ఈవెంట్స్ అన్నింటికీ సాంప్రదాయబద్ధంగా నిండుగా ఉన్న చీరకట్టులోనే హాజరయ్యారు. సమంతకు బేబీ బంప్ రావడం వల్లే.. అది బయటకు కనిపించకుండా ఉండేందుకు ఇలా చీరలు, సాంప్రదాయ దుస్తులు ధరించారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

నిజానికి గతేడాది డిసెంబర్ 1వ తేదీని కోయంబత్తూరులోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లయిన కొన్ని నెలలకే ఈ తరహా ప్రెగ్నెన్సీ పుకార్లు రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తలు నిజమైతే సమంత ఫ్యాన్స్ కు అంతకంటే ఆనందం మరొకటి ఉండదని నెటిజన్లు అంటున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై సమంత కానీ లేదా ఆమె అధికారిక టీమ్ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+