గుర్తు పట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్- క్యారెక్టరైజేషన్

టాలీవుడ్ లో దశాబ్ద కాలానికి పైగా తనదైన నటన, అందంతో అగ్ర కథానాయికగా రాణించిన కాజల్ అగర్వాల్.. పుట్టినరోజు నేడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సరసన నటిస్తున్న నూతన చిత్రం 'NBK111' టీమ్ నుంచి అందిన శుభాకాంక్షలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం ఆమె ఎన్బీకే 111లో నటిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. బాలయ్యకు ఇది 111వ చిత్రం. వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీష్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. మరోసారి బాలయ్య- కాజల్ అగర్వాల్ జతకట్టడంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.

Gopichandh Malineni Shares Kajal Aggarwal First Look from Balakrishna Movie NBK 111 on her birthday

ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. కాజల్ పాత్రను కూడా గత చిత్రాల కంటే ఎంతో భిన్నంగా, నటనకు ఆస్కారం ఉన్న రీతిలో తీర్చిదిద్దాడనేది ఆమె ఫస్ట్ లుక్ చూస్తేనే తెలిసిపోతుంది. చీరెకట్టు, కళ్లద్దాలు షార్ప్ లుక్స్ తో డిఫరెంట్ గా కనిపించారు కాజల్. ఆమె గెటప్ ఐఎఎస్ స్థాయి అధికారిణిని తలపిస్తోంది.

పాతాళానికి పసిడి రేట్లు- హఠాత్తుగా
పాతాళానికి పసిడి రేట్లు- హఠాత్తుగా

తెలుగు చిత్రసీమలోకి 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో అరంగేట్రం చేసిన కాజల్, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' సినిమాతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. దశాబ్దం దాటినా చెదరని గ్లామర్‌తో, ఇప్పటికీ టాలీవుడ్‌లో తిరుగులేని స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

Take a Poll

వివాహం చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ తన సినీ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పెళ్లి తర్వాత ఆమె ఎంచుకుంటున్న పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలు, మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తోన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కాజల్ పుట్టినరోజు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+