Telegram: టెలిగ్రామ్ బ్యాన్ పై తేల్చేసిన ఢిల్లీ హైకోర్టు- కీలక తీర్పు..!

వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ రీటెస్ట్ (NEET Retest 2026)లో ప్రశ్నాపత్రాలు మరోసారి లీక్ కాకుండా ఉండేందుకు కేంద్రం టెలిగ్రామ్ (Telegram) యాప్ పై తాత్కాలిక నిషేధం విధించింది. దీన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నీట్ పరీక్ష కోసం భారత్ లో 15 కోట్ల మంది యూజర్లను ఎలా ఇబ్బంది పెడతారని ప్రశ్నించింది. అలాగే కేంద్రం కూడా నిషేధాన్ని సమర్ధించుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

గతంలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ తర్వాత టెలిగ్రామ్ యాప్ లోనే సర్కులేట్ అయ్యాయన్న కారణంతో కేంద్రం ఈసారి ఈ యాప్ పై తాత్కాలిక నిషేధం విధించింది. ఎల్లుండి నీట్ పరీక్ష ముగిసిన తర్వాత ఈ నెల 22 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. పరీక్షల్లో అవకతవకలపై ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమంజసమే అని పేర్కొంది.

Telegram Stays Banned Delhi High Court Backs Government s Move

ఈ మేరకు సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 69A కింద కేంద్రం జారీ చేసిన నిరోధక ఉత్తర్వును సవాలు చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కరియా కొట్టివేస్తూ ఈ తీర్పును వెలువరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు అతి తక్కువ ఆంక్షలతో కూడినవని, ఈ ఉత్తర్వు తగినది కాదని చెప్పలేమని తెలిపింది. నీట్-యూజీ వివాదంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవస్థీకృత మోసపూరిత నెట్‌వర్క్‌లు టెలిగ్రామ్‌ను వాడుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ తాత్కాలిక ఆంక్షలు విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+