పేపర్ లీక్ అరికట్టమంటే.. టెలిగ్రామ్ బ్యాన్ చేయడం ఓ కామెడీ సర్కస్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో చోటు చేసుకుంటోన్న తాజా రాజకీయ, సాంకేతిక పరిణామాలపై స్పందించారు. మోదీ సర్కార్ తీరును ఆయన వేలెత్తి చూపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు గుప్పించారు.
ఇటీవల ఐఏఎఫ్ రక్షణ విమానాల అంశం, టెలిగ్రామ్ యాప్ నిషేధానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక కామెడీ సర్కస్ లాగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. దేశంలో నిరంతరాయంగా జరుగుతున్న విద్యాసంస్థల పరీక్షల పేపర్ లీకేజీలు ఎప్పటికీ ఆగవని, దీని వెనుక ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

దేశవ్యాప్తంగా యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న పరీక్షల పేపర్ లీకేజీల వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పేపర్ లీక్‌ల దందా ద్వారా ఆర్జిస్తున్న వేల కోట్ల రూపాయల అక్రమ సొమ్మును విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే లీకేజీలను అడ్డుకోవడం లేదని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం దేశంలో టెలిగ్రామ్ నిలిపివేయడాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. పరీక్షల లీక్ అను అరికట్టాలంటూ కోట్లాదిమంది విద్యార్థులు డిమాండ్ చేస్తోండగా.. దాన్ని పట్టించుకోకుండా టెలిగ్రామ్ ను బంద్ చేయడంలో అర్థమే లేదని కేజ్రీవాల్ అన్నారు. ప్రభుత్వ, పరిపాలనా వైఫల్యాలను టెలిగ్రామ్ యూజర్లు కోట్లాదిమంది ప్రజలకు తెలిసేలా చేస్తున్నారనే ప్రచారం చేస్తోన్నారనే కారణంతోనే దీన్ని నిషేధించిందని మండిపడ్డారు.
ఇప్పటికే ఈ అంశంపై అన్నామలై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహణను యుద్ధ వాతావరణంగా మార్చిందని ఆరోపించారు. సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, పరీక్షా కేంద్రాల వద్ద రెండంచెల రక్షణ, ఐఏఎఫ్ ఎయిర్‌లిఫ్ట్ తనిఖీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నాలుగు అంచెల సీసీటీవీల నిఘా, ప్రవేశ ద్వారాల వద్ద ఫేషియల్ రికగ్నిషన్, ప్రధాని కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణ వంటి ఏర్పాట్లను తప్పుపట్టారు. వీటి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications