వరద బాధితులకు కొత్తగా రుణాలు - అమలు ఇలా..!!

వరద బాధితుల రుణాల విషయంలో బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బాధితులకు సంబంధించిన రుణాలను రీషెడ్యూల్ చేయటానికి ముందుకు వచ్చాయి. రుణాల చెల్లింపుకు ఏడాది పాటు మారిటోరియం విధించాయి. ఏపీ ఆర్దిక శాఖ అధికారులు ఈ అంశాన్ని నిర్దారించారు. రుణాల పొందిన పలు కేటగిరీలకు చెందిన వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. రీషెడ్యూల్ తో పాటుగా కొత్తగా వినియోగ రుణాలు పొందవచ్చని వెల్లడించారు.

బాధితుల కోసం
వరద బాధితుల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఆర్దిక ప్యాకేజీ ప్రకటించింది. వరదలతో భారీగా నష్టపోయిన వారికి విద్యుత్ బిల్లుల చెల్లింపును వాయిదా వేసారు. ఇదే సమయంలో వరద బాధితులకు రుణాల చెల్లింపులకు ఏడాది పాటు మారిటోరియం విధించటానికి బ్యాంకులు అంగీకరించాయి. దీని ద్వారా రైతులు, ఆటో రిక్షా, చిన్న వ్యాపారులు, వాణిజ్య సంస్థలు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, చిన్నతరహా పరిశ్రమలకు ఈ మారిటోరియం వర్తిస్తుందని వివరించారు.

Banks agreed for Loans reschedule and maritorium in Flood Affected areas

రుణాలపై మారిటోరియం
విజయవాడ నగర పరిధిలోని 179 సచివాలలయాల పరిధిలోని వదర ప్రభావిత ప్రజలకు మారటోరియం వర్తిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ కుటుంబాలు రూ 50 వేలు, మొదటి..ఆపై అంతస్తుల్లోని కుటుంబాలు రూ 25 వేల వరకు కొత్తగా వినియోగ రుణాలు పొందవచ్చని అధికారులు స్పష్టం చేసారు. వీటికి మూడు నెలల మారిటోరియం ఉంటుంది. రుణాలను 36 నెలల్లో తిరిగి చెల్లించేలా నిర్ణయించారు. అవసరం మేరకు పంట రుణాలు పొందవచ్చని స్పష్టం చేసారు.

కొత్తగా రుణాలు
చిన్న వ్యాపారులు, వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడికి కొత్త రుణాలు తీసుకోవచ్చని ఆర్దిక శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే విజయవాడ వరద బాధితులకు ఆర్దిక ప్యాకేజీ ఖరారు చేసింది. వరదల్లో మునిగిన ప్రతి ఇంటికి రూ.25వేలు, మొదటి అంతస్తులోని బాధితులకు రూ.10వేలు, ఇళ్లలోకి నీరొచ్చిన బాధితులకు రూ.10వేలు చొప్పున ఆర్దిక సహాయం అందించనున్నట్లు సిఎం వెల్లడించారు. అర్బన్‌, రూరల్‌ని కలుపుకుని 2,72,727 కుటుంబాలు వరదలతో నష్టపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+