జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
వైఎస్ జగన్ సీఎం కావాలనే కోరికతో ఆయన అభిమానులు గతంలో చేసిన ఎన్నో దీక్షలు చూశాం. ఇదే కోవలో జగన్ ను సీఎం కావాలని కోరుకుంటూ ఐదేళ్ల క్రితం అంటే గత ఎన్నికలకు ముందు కర్నూలుకు చెందిన ఓ అభిమాని ఇలాగే దీక్ష చేపట్టాడు. ఈ దీక్షలో భాగంగా జగన్ సీఎం అయ్యేవరకూ చెప్పులు వేసుకోకుండా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే సదరు అభిమాని దీక్ష చేపట్టడం, ఆ తర్వాత జగన్ సీఎం కావడం పూర్తయ్యాయి. అయితే జగన్ స్వయంగా తన వద్దకు వస్తే దీక్ష విరమించాలన్న అతని పట్టుదలకు చివరకు ప్రతిఫలం కూడా లభించింది.
దివంగత సీఎం వైఎస్సార్ అభిమాని అయిన కర్నూలు జిల్లాకు చెందిన దూదేకుల కాశీ అనే వ్యక్తి ఆయన మరణంతో కుంగిపోయాడు. అదే సమయంలో వైఎస్ జగన్ పావురాల గుట్టలో సభ పెట్టి తన బాధను అభిమానులతో పంచుకున్నారు. ఆ సభలో పాల్గొన్న కాశీ.. అప్పటి నుంచి జగన్ అభిమానిగా మారిపోయాడు. ఏదో ఒక రోజు జగన్ సీఎం కావాలని బలంగా కోరుకున్నాడు. అంతే కాదు తన కులదైవం ముందు చెప్పులు వదిలేసి జగన్ సీఎం కావాలంటూ దీక్షకు దిగాడు. తన అభిమాన జగనన్న సీఎం జగన్ గా మారిన తర్వాతే చెప్పులు వేసుకుంటా అని దీక్ష తీసుకున్నాడు.

పొలం పనులు చేసుకునేప్పుడు ఇబ్బందులు పడ్డా, చుట్టుపక్కల వారు మాటలతో బాధ పెట్టినా కాశీ మాత్రం ఒక అకుంఠిత దీక్ష ను వదిలిపెట్టలేదు. అలాగే చెప్పుల్లేకుండా పొలాల్లో పదేళ్లు తిరిగాడు. 2019లో వైయస్ జగన్ ఘన విజయం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కాశీకి మాత్రం జగన్ ను కలిసేందుకు అవకాశం రాలేదు. దీంతో సీఎం స్వయంగా వచ్చి తనని కలిసే వరకు ఈ దీక్ష విరమించేది లేదని ఎండనకా, వాననకా చెప్పులు లేకుండానే గత కొన్నేళ్లుగా అలాగే తిరుగుతున్నాడు. విషయం తెలిసిన వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి కాశీని సీఎం జగన్ కర్నూలు పర్యటనలో తీసుకెళ్లారు.

సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నిన్న కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఎమ్మెల్యే శిల్ప రవి సహాయంతో అభిమాని కాశీ సీఎం జగన్ ను కలిశారు. దీంతో సీఎం జగన్ స్వయంగా తనకి చెప్పుల జతను అందించారు. దీంతో ఆయన సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. నంద్యాల జిల్లాలోని కానాల గ్రామానికి చెందిన తనకు జగన్ స్వయంగా వచ్చి చెప్పులు ఇవ్వడంతో జగనన్నను చూసిన వెంటనే సాక్ష్యాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్లుగా ఆనందబాష్పాలు వచ్చాయని, ఆ ఆనందం ఒక్క మాటలో చెప్పలేనని తెలిపాడు.












Click it and Unblock the Notifications