ఢిల్లీలో భిక్షగాడిగా కెసిఆర్, చిరుకు సీమంతం!(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఉద్యమం దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్నా అదే ఊపులో ఉంది. అన్ని వర్గాల వారు రోడ్ల పైకి వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.
పలు జిల్లాలో వివిధ రూపాల్లో సమైక్యవాదులు మంగళవారం తమ ఆందోళనలు కొనసాగించారు. రాస్తారోకోలు, మానవహారాలు, లక్షగళ గర్జనతో తమ నిరసనను తెలియజేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పలువురు మహిళలు సమైక్యాంధ్రకు మద్దతుగా తెలంగాణలో ఆడే బతుకమ్మ ఆటను ఆడి నిరసన తెలిపారు.
కడప జిల్లాలో మంత్రి సి రామచంద్రయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ సమైక్యవాదులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. మరోవైపు ఎపిఎన్జీవోలు హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా సమ్మె కొనసాగిస్తామని చెబుతున్నారు.

జగ్గయ్యపేట
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సీమాంధ్రకు మద్దతుగా సమైక్యాంధ్ర జగ్గయ్యపేట ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మను పేర్చిన దృశ్యం.

బతుకమ్మ
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సీమాంధ్రకు మద్దతుగా సమైక్యాంధ్ర జగ్గయ్యపేట ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు.

ర్యాలీ
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో గురువారం ఎపిఎన్జీవోల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉద్యోగులు పాల్గొన్నారు.

కృష్ణుడి రూపంలో
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో గురువారం నిర్వహించిన ఎపిఎన్జీవోల ర్యాలీలో శ్రీకృష్ణుడి వేషధారణలో నిరసన తెలుపుతున్న దృశ్యం.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును సమైక్యవాదులు భిక్షగాడి రూపంలో చిత్రీకరించి నిరసన తెలిపారు. సోనియమ్మ తెలంగాణమ్మ అంటూ... కెటిఆర్‌ను ఎత్తుకొని, 10 జనపథ్ వద్ద కూర్చున్నట్లుగా చిత్రీకరించారు.

హిజ్రా మంత్రులు
సమైక్యాంధ్రకు మద్దతుగా 'సీమాంధ్ర హిజ్రా మంత్రుల' రూపంలో నిరసన తెలుపుతున్న దృశ్యం. విశాఖ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

టిడిపి వర్సెస్ కాంగ్రెసు
జివిఎంసి వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన ఆందోళనలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య గొడవ జరిగింది. పరస్పరం తోసుకున్నారు.

ఫ్లెక్సీకి నిప్పు
జివిఎంసి వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన ఆందోళనలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య గొడవ జరిగింది. పరస్పరం తోసుకున్నారు. టిడిపి ఫ్లెక్సీకి నిప్పు పెట్టిన దృశ్యం.

చిరు, కావూరి
కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావుల వేషధారణలో ఉన్న వారికి సీమంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దృశ్యం.












Click it and Unblock the Notifications