2.5 కోట్ల ఓట్ల టార్గెట్, జగన్ వర్సస్ చంద్రబాబు - గెలిచేదెవరు, లెక్క పక్కా..!!

ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ వర్సస్ చంద్రబాబు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీఎం జగన్ ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి తన ఓట్ బ్యాంక్ మరింత పెంచుకొనేలా అడుగులు వేస్తున్నారు. ఇద్దరి గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఆ 2.5 కోట్ల ఓట్లు ఇప్పుడు ఇద్దరికి అధికారం దగ్గర చేయటంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి.

మహిళా ఓట్ బ్యాంక్ పైనే గురి : ఏపీలో ఓట్ బ్యాంక్ పైన లెక్కలు..అంచనాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన సమయం నుంచి 2024 ఎన్నికల పైన జగన్ ఫోకస్ చేసారు. అప్పటికే ఇచ్చిన హామీల అమల్లో తొలి నుంచి వ్యూహాత్మకం గా వ్యవహరించారు. జగన్ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు మహిళలే లబ్దిదారులుగా ఉన్నారు. సామాజిక పెన్షన్లు..రైతు భరోసా మినహా అన్నింటా మహిళలే లబ్దిదారులు.

 jagan-chandrababu

ఇంటి పట్టాల నుంచి పథకాల వరకు అన్నీ మహిళలకే అందుతున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది మహిళా ఓటర్లను నాలుగేళ్లుగా తన పథకాలతో తనకు అండగా ఉండేలా జగన్ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు జగనన్న సురక్ష పేరుతో అర్హులుగా ఉండి పథకాల్లో చేరని వారికి తాజాగా అవకాశం కల్పిస్తూ మరింత ఓట్ బ్యాంక్ పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

సీఎం ను డిసైడ్ చేసే ఓట్ బ్యాంక్ : జగన్ వై నాట్ 175 ధీమా వెనుక పథకాలు..లబ్దిదారులేనని చంద్రబాబు గ్రహించారు. పదే పదే ప్రస్తావించే అభివృద్ధి నినాదానికి గ్యాప్ ఇచ్చి సంక్షేమం అజెండాను పార్టీ జెండాగా మార్చారు. పార్టీ మహానాడు వేదిక గా తొలి విడత మేనిఫెస్టో ప్రకటించారు. మహాశక్తి పేరుతో మహిళలను ఆకట్టుకొనే పథకాలను ఖరారు చేసారు.

ప్రతీ బిడ్డకు చదువుకు రూ 10 వేలు, ప్రతీ ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతీ మహిళకు రూ 1500 నగదు వంటి అంశాలు ప్రకటించారు. వీటిని ఇప్పుడు మహిళల్లోకి తీసుకెళ్లి..జగన్ పథకాల కంటే మెరుగైన పథకాలుగా ప్రచారం ప్రారంభించారు. ఇవన్నీ పక్క రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాపీ కొట్టారని వైసీపీ ఆరోపిస్తోంది.

 jagan-chandrababu

మహిళా ఓటర్లు ఎవరివైపు : ఈ పథకాలు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు అమలు చేయలేదనేది వైసీపీ ప్రశ్న. ఇంతకంటే మెరుగ్గా మహిళలకు మేలు చేసేలా నాలుగేళ్ల కాలంలో రూ 2.24 లక్షల కోట్ల మేర లబ్ది జరిగిందని వైసీపీ వివరిస్తోంది. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని గుర్తు చేయటం ద్వారా..చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది.

తాము చెప్పిన ప్రతీ మాట అమలు చేసి ఆచరణలో చూపించామని ప్రచారం చేసుకోంటోంది. ఇప్పుడు టీడీపీ మహాశక్తి పథకాల పై 40 రోజుల ప్రచారం ప్రారంభించింది. సంక్షేమం..సామాజిక న్యాయం పేరుతో నాలుగేళ్లుగా జగన్ చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయా..ఇప్పుడు మహాశక్తి పేరుతో చంద్రబాబు కొత్త వ్యూహాలు ఫలిస్తాయా అనేది మహిళా ఓటర్లే తేల్చాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+