బెగ్గర్స్ టర్నోవర్ రూ. 140 కోట్లు: చెప్పుల్లో దాచి తెచ్చి..
హైదరాబాద్: యాచకుల గురించి ఓ న్యాయవాది ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టాడు. భిక్షగాళ్ల వల్ల హైదరాబాద్‌లో ఏటా 140 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతోందని ఆ న్యాయవాది అనన్ారు. తెలంగాణలో భిక్షగాళ్ల వ్యవస్థను రూపమాపాలని కోరుతూ డివి రావు అనే వ్యక్తి హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజనాల వ్యాజాన్ని (పిల్‌ను) వేశారు.
హైదరాబాదులోనే దాదాపు 11 వేల మంది యాచకులున్నారని ఆయన తన పిల్‌లో చెప్పారు. వారిని పునరావాస కేంద్రాల్లో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. హోంశాఖ కార్యదర్శిని, మహిళా శిశు సంక్షేమ శాఖను ఆయన తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.

సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో గంజాయి సరఫరా జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి వచ్చే ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తూ ఓ వ్యక్తి శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
నయీమ్ అనే వ్యక్తి చెప్పుల్లో గంజాయిని పెట్టుకుని ఖైదీలకు అందించేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు నయీమ్‌ను పట్టుకుని విచారించారు. చెప్పుల్లో దాచిన 20 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి సెక్యూరిటీ మధ్య వచ్చిన ఓ ఖైదీకి గంజాయి అందించేందుకు అతను వచ్చాడని పోలీసులు తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications