కెసిఆర్ ఢిల్లీ టూర్: దూరం.. బాబుకు మోడీ మరో షాకిచ్చేనా?
ఢిల్లీ: ఏపీలో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ దూరం జరిగేందుకు ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. అయితే, ఏపీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు మాత్రం బీజేపీకి దూరం జరిగేందుకు ఏమాత్రం సుముఖంగా లేరు.
సరిగ్గా నిధులు ఇవ్వలేదని చెబుతూనే, ప్రత్యేక హోదా పైన కేంద్రం షాకిచ్చినా... రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీకే మొగ్గు చూపుతున్నారు. అయితే, బీజేపీ మాత్రం టీడీపీతో దోస్తీని కట్ చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం తాను ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తానని చంద్రబాబు చెబుతున్నారు. కేంద్రాన్ని ఒప్పిస్తామని అంటున్నారు. ఒకటికి వందసార్లు ఢిల్లీకి తిరుగుతానని చెబుతున్నారు.
అయితే, ప్రత్యేక హోదాతో పాటు నిధుల విషయంలోను చంద్రబాబుకు కేంద్రం నుంచి షాక్ తగిలే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు ఇటీవల తెలంగాణ సీఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని అంశాలను గుర్తు చేస్తున్నారు.

కేసిఆర్ కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే, నిధుల విషయంలో కేంద్రం నుంచి అంత సానుకూలం కనిపించలేదని వార్తలు వస్తున్నాయి. కేంద్రం తన పరిస్థితే బాగోలేదని కేసీఆర్‌కు చెప్పిందని ఓ వర్గం మీడియా వార్తలు రాసింది.
కేంద్రం నుంచి కెసిఆర్ పెద్ద ఎత్తున ప్యాకేజీని ఆశించారు. కానీ అలాంటి అవకాశాలు కనిపించడం లేదని, కేంద్రం పరిస్థితే బాగా లేనందున ప్యాకేజీకి అవకాశం లేదని అంటున్నారని చెబుతున్నారు.
కేసీఆర్‌కు కేంద్రం మొండిచేయి అని చెప్పకుండా.. ఆర్థిక కష్టాల్లో ఉన్నందున కేంద్రం ఏం చేయలేకపోతున్నామని చెప్పిందని అంటున్నారు. అంటే, తర్వాత చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు రాబట్టకపోయినా అపవాదు పడకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, కేసీఆర్‌తో భేటీ అనంతరం ప్రధాని కార్యాలయం... తెలంగాణ ప్రభుత్వం పథకాలను మెచ్చుకుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలను మెచ్చుకున్నారు.
తన పార్టీ, మిత్రపక్షం కానీ కేసీఆర్‌ను చంద్రబాబు మెచ్చుకున్నారని, కానీ మిత్రపక్షమైన చంద్రబాబును మెచ్చుకున్న సందర్భాలు లేవని గుర్తు చేస్తున్నారు.
అలాగే, ప్రత్యేక హోదా పైన, నిధుల విషయంలో ఏపీ బీజేపీ నేతలు.. టిడిపిపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని బీజేపీ అధిష్టానం అదుపు చేయడం లేదు. పైగా, ఇటీవల కేంద్రమంత్రులు చంద్రబాబుపై పరోక్ష కామెంట్లు చేశారు. వీటన్నింటిని చూస్తుంటే చంద్రబాబుకు దూరం జరిగేందుకే బీజేపీ సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఓ విధంగా, చంద్రబాబుకు దూరం జరిగేందుకే ప్రత్యేక హోదాను ఆలస్యం చేస్తున్నారా? అనే అనుమానం కూడా కొందరిలో కలుగుతుందంటున్నారు. కేసీఆర్‌ను ప్రధానమంత్రి మెచ్చుకోవడం తెలుగుదేశం పార్టీకి పుండుమీద కారం చల్లినట్లుగా ఉందని అంటున్నారు.
మరో విషయమేంటే, తెరాస కేంద్రంలో చేరనుందనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిని ఇరు పార్టీల నేతలు కొట్టి పారేస్తున్నారు. కానీ పార్టీల తీరు చూస్తుంటే మాత్రం కేంద్రంలో చేరినా ఆశ్చర్యపోయే అవకాశం లేదన్నట్లుగా ఉందని అంటున్నారు. మోడీ.. బాబుకు దూరం అవుతూ, కెసిఆర్‌కు దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. టిఆర్ఎస్ కేంద్రంలో చేరితో కవితకు మంత్రి పదవి వస్తుందనే పుకార్లున్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications