కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడేళ్ల క్రితం బెంగళూరు ఏటీఎంలో స్త్రీపై కత్తితో దాడి: ఈ కేసులోనూ అతనే

మూడేళ్ల క్రితం(2013) బెంగళూరులోని ఓ ఏటీఎంలో మహిళను హత్య చేసిన నిందితుడు మధుకర్ రెడ్డిని చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు పట్టుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: మూడేళ్ల క్రితం(2013) బెంగళూరులోని ఓ ఏటీఎంలో మహిళపై కత్తితో దాడి చేసిన నిందితుడిని చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు పట్టుకున్నారు. 2013లో బెంగళూరులోని ఓ ఏటీఎంలు డబ్బులు తీసేందుకు వచ్చిన బ్యాంకు ఉద్యోగి జ్యోతి ఉదయ్ అనే మహిళను నిందితుడు కత్తితో దారుణంగా పొడిచి.. దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే.

ఎటిఎం కేంద్రంలో మహిళా బ్యాంక్ మేనేజర్‌పై దాడిఎటిఎం కేంద్రంలో మహిళా బ్యాంక్ మేనేజర్‌పై దాడి

ప్రస్తుతం ఆ నిందితుడ్నే పోలీసులు పట్టుకున్నారు. ఓ హత్యాప్రయత్నం కేసులో విచారిస్తుండగా తమకు పట్టుబడిన నిందితుడే బెంగళూరు ఎటిఎం దాడి కేసులోనూ నిందితుడని తేలింది. అతన్ని చిత్తూరు జిల్లాకు చెందిన మధుకర్ రెడ్డిగా గుర్తించారు. విచారణలో అతను ఎటిఎం దాడికి పాల్పడింది తానే అని అంగీకరించాడు. శనివారం సాయంత్రం మధుకర్ రెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఏటిఎంలో స్త్రీపై దాడి: కరుడు గట్టిన నేరస్థుడి పనేఏటిఎంలో స్త్రీపై దాడి: కరుడు గట్టిన నేరస్థుడి పనే

Bengaluru ATM woman murder: accused arrest

మహిళ హత్య: బెంగళూర్ ఏటిఎం దాడి నిందితుడేనా?మహిళ హత్య: బెంగళూర్ ఏటిఎం దాడి నిందితుడేనా?

కాగా, గతంలో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ ఐదేళ్ల క్రితం కడప జైలు నుంచి మధుకర్ రెడ్డి తప్పించుకున్నాడు. వారం క్రితమే మధుకర్ రెడ్డిని మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది. మధుకర్ రెడ్డి గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా, 2013 సెప్టెంబర్ నెలలో నిందితుడు ఏటీఎంలో ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతి.. అప్పట్లో పక్షవాతానికి కూడా గురయ్యారు. తర్వాత కొంతకాలానికి కోలుకుని మళ్లీ విధుల్లో చేరారు.

English summary
A person arrested in Bengaluru ATM woman murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X