చంద్రబాబు ముందే ఏడ్చాను: భూమా గత వ్యాఖ్యలపై సాక్షి చురకలు

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు భూమా అఖిలప్రియను వైసీపీలోనే కొనసాగాలని విశ్వప్రయత్నాలు చేసినా చివరకు ఫలించలేదు.

గతంలో భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు దూకుడుగా మేం నచ్చుతామని, అప్పుడు ఆయన మమ్మల్ని ఉపయోగించుకున్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు అవమానం జరిగితే చంద్రబాబు ముందే ఏడ్చానని, అయినా సరే పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారంట.

చంద్రబాబుకు ఓదార్చడం కూడా రాదు. కార్యకర్తలను, ప్రజా ప్రతినిధులను ఓదార్చే అలవాటు ఉందో లేదో కూడా తెలియదని, తెలుగుదేశం పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసినా దగ్గరకు తీసుకోలేదని అన్నారట. ప్రతిదాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారట.

తెలుగుదేశం పార్టీలో మేం సిన్సియర్‌గా పనిచేస్తేనే ఆ పాటి గౌరవం దక్కింది. ఇతర పార్టీలోకి వెళ్లి మళ్లీ తెలుగుదేశంలోకి వస్తే ఏ పాటి గౌరవం ఉంటుందో ఎవరికి వారు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారట. ఈ విధంగా మాట్లాడిన భూమా నాగిరెడ్డి ఇప్పుడు మంత్రి పదవికోసమే టీడీపీలో చేరినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో సోమవారం రాత్రి వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే.

Bhuma Nagi reddy comments on chandrababu naidu in earlier days

పార్టీ ఫిరాయింపులపై జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి. మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్లు, ఇది న్యాయమా? అని ప్రశ్నించారు.

టీడీపీలో గెలిచి రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారంటే.. అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా తమ్ముళ్లూ? ఇది న్యాయమా? ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తులను చిత్తు చిత్తుగా ఓడించాలి. స్వార్థంతో కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినా పార్టీ కార్యకర్తలు చెక్కు చెదరలేదు. ఒకరు పోతే వందమంది నేతలను తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+