సూపర్ సిక్స్-సూపర్ హిట్-అనంతలో 10న భారీ సభ-కూటమి ప్లాన్..!

ఏపీలో కూటమి పార్టీలు గత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని దాదాపుగా అమలు చేశాయి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న క్రమంలో కూటమి ప్రభుత్వం కీలకమైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి కీలక హామీల్ని నెరవేర్చేసింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అంతే స్ధాయిలో ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 10న భారీ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

అనంతపురంలోని ఇంద్రప్రస్థనగర్ లో ఈ నెల 10న కూటమి పార్టీలు భారీ సభను ప్లాన్ చేశాయి. ఎన్టీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నేతలు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరు కానున్నారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీలు నిర్వహించే తొలి సభ కావటంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు.

Big NDA Show Super Six Super Hit Meeting Scheduled in Anantapur on Sept 10

ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించటంపై ఈ సభలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. మొత్తంగా 15 నెలల పాలనా విజయాలను ఆవిష్కరించేలా సభను నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. సూపర్ సిక్స్ పథకాలతో లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరింది. అలాగే ప్రభుత్వంగా ఇప్పటి వరకూ అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు చెప్పాలని కూటమి అగ్రనాయకత్వం భావిస్తోంది.

Big NDA Show Super Six Super Hit Meeting Scheduled in Anantapur on Sept 10

ఎన్నికలకు ముందు రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు చేసుకున్న మూడు పార్టీలు... అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాతో వెళ్తున్నాయి. 15 నెలల కాలంలో మూడు పార్టీలు అత్యంత సమన్వయంతో పని చేస్తున్నాయి. అవసరమైన సమయాల్లో కేంద్రంతో, ప్రధాని మోదీతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవుల విషయంలోనూ మూడు పార్టీల మధ్యే అంతే సమన్వయం, సహకారం కన్పిస్తోంది. ప్రాంతాలు, జిల్లాల వారీగా... ఆయా సామాజిక వర్గాల సమీకరణాలను బేరీజు వేసుకుని నామినేటెడ్ పదవుల కూర్పు చేపడుతున్నారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పని చేస్తున్నాం.. ఇక భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే రీతిలో ఓ బలమైన సంకేతాన్ని ఈ వేదిక ద్వారా పంపాలన్నది కూటమి నేతల లక్ష్యంగా కన్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+