హైకోర్టులో సజ్జల, ఆర్కే సహా వైసీపీ నేతలకు రిలీఫ్- టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో..!
ఏపీలో గత వైసీపీ పాలనలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ కీలక నేతలకు ఇవాళ భారీ ఊరట లభించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ఆఫీసుపై దాడి కేసిన కేసులో ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు వైసీపీ నేతల తరఫున దేవినేని అవినాష్ వేసిన పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేసింది. ఈ కేసులో పోలీసుల తరఫున కేఎం కృష్ణారెడ్డి, అవినాష్ తరఫున సినీయర్ న్యాయవాది రవిచందర్ తమ వాదనలు వినిపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వైసీసీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైనా ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేశ్ కు ముందస్తు ఈ నెల 16 వరకూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 16 వరకూ వీరిపై ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆ లోపు వీరికి ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications