టీడీపీకి బిగ్ షాక్: రాజకీయాలకు గల్లా జయదేవ్ గుడ్ బై!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ చంద్రబాబుకు ఊహించని షాక్ ఇస్తున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గల్లా జయదేవ్ త్వరలో ప్రకటన చేయనున్నారు. పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండే గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబుకు, నారా లోకేష్ కు ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తుంది.
గల్లా జయదేవ్ రాజకీయాలను పక్కనబెట్టి పూర్తిగా వ్యాపారాలకే పరిమితం అవ్వాలని భావిస్తున్న క్రమంలో రాజకీయాలకు ప్రస్తుతం ఒక బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి గల్లా జయదేవ్ ఎంపీగా రెండు పర్యాయాలు విజయం సాధించారు. అనంతరం పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్లోని సమస్యలపైన తన గళాన్ని వినిపించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం ఒకానొక దశలో తన సంభాషణలతో ఢీకొట్టారు.

అయితే గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉండటంవల్ల ఆయన వ్యాపారాలు దెబ్బతింటున్న టాక్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాటి నుండి గల్లా జయదేవ్ అమర్ రాజా కంపెనీకి వేధింపులు మొదలయ్యాయి. ఏపీలో వేధింపులు తట్టుకోలేకపోయిన గల్లా జయదేవ్ తన వ్యాపారాన్ని హైదరాబాద్ కు మార్చారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
రాజకీయాలకు గుడ్ బై చెప్తున్న క్రమంలో గుంటూరు ఎంపీగా రెండు పర్యాయాలు గెలిచినందుకు గల్లా జయదేవ్ తనకు ఎంతోకాలంగా సపోర్ట్ చేస్తున్న నాయకులు, కేడర్ తో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని సమాచారం.
ఇక ఈనెల 28వ తేదీన గల్లా జయదేవ్ లోకేష్ తో పాటుగా టిడిపి నేతలతో భేటీ కానున్నారని సమాచారం. మొత్తంగా గల్లా జయదేవ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలకు బ్రేక్ ఇస్తూ తీసుకుంటున్న ఈ నిర్ణయం చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి.












Click it and Unblock the Notifications