ఈసారి అసెంబ్లీలో జగన్ కు అసలు సవాల్ అదే ! బాబు, పవన్ ను మించి..!
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీని ప్రధాన విపక్ష హోదా కూడా దక్కకుండా చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర అవమానకర పరిస్ధితుల్లో అసలు అసెంబ్లీకి హాజరవుతారా లేక దూరంగా ఉండిపోతారా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఒక వేళ జగన్ అసెంబ్లీకి హాజరవుతారని అనుకుంటే.. ఆయనకు ఎదురయ్యే అసలు సవాల్ ఏంటన్న దానిపై పలు చర్చలు జరుగుతున్నాయి.
గతంలో వైసీపీకి జనం 151 సీట్లతో అధికారం కట్టబెట్టిన వేళ 23 సీట్లతో విపక్షంలో కూర్చొన్న టీడీపీని జగన్ తీవ్రంగా అవహేళన చేసేవారు. ప్రధాన విపక్ష హోదా దక్కించుకున్నప్పటికీ లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేవారు. అంతే కాదు తన ఎమ్మెల్యేలతో విపక్ష నేత అయిన చంద్రబాబును దారుణంగా తిట్టించేవారు. చంద్రబాబు మాట్లాడేందుకు సీట్లో నుంచి లేవగానే ఆయనపై వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు చేస్తూ తీవ్రంగా అవమానించేవారు. అయినా కొంతకాలం అలాగే తట్టుకున్న చంద్రబాబు ఓ దశలో ఆయన భార్యపై వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక బాయ్ కాట్ చేశారు.

ఈ అనుభవం ఇప్పుడు జగన్ ను వెంటాడబోతోంది. అందుకే జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. అయితే జగన్ ఒక వేళ అసెంబ్లీకి హాజరైతే సీఎం చంద్రబాబు నుంచో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచో ఈ తరహా దూషణలు ఉండకపోవచ్చు. కానీ స్పీకర్ కాబోతున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయన్నపాత్రుడు రూపంలో జగన్ ను దురదృష్టం వెంటాడేలా కనిపిస్తోంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి.
గతంలో ప్రతీ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉన్న సీనియర్ ఎమ్మెల్యే, బీసీ నాయకుడైన చింతకాయల అయన్నపాత్రుడును వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీవ్రంగా టార్గెట్ చేశారు. నర్సీపట్నంలో ఆయన రెండు గజాల భూమి కబ్జా చేశారంటూ ఇంటిని కూల్చివేయడమే కాకుండా పోలీసులతో అరెస్టు చేయించి ఇబ్బందులు పెట్టారు. ఆయన కుమారుడిపైనా పలు కేసులు పెట్టారు. దీంతో గత ఐదేళ్లుగా అయ్యన్నపాత్రుడు కూడా ఎక్కడా తగ్గకుండా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఆయన స్పీకర్ కాబోతుండటంతో జగన్ విషయంలో అయన్న ఎలా వ్యవహరిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే ఇప్పుడు జగన్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.












Click it and Unblock the Notifications