అంజూ యాదవ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్-పవన్ ముందు వైసీపీ కొత్త డిమాండ్-మొత్తం సీన్ రివర్స్..
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ జనసేనగా మారుతున్న రాజకీయంలో శ్రీకాళహస్తి మహిళా సీఐ అంజూ యాదవ్ మధ్యలో దూరారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు నిరసనలు చేస్తుండగా.. వారికి పోటీగా నిరసనలు చేపట్టిన జనసేన నేత ఒకరిని కాళహస్తి సీఐ అంజూ యాదవ్ చెంపలు వాయించడం వివాదాస్పదమైంది. దీనిపై ఇప్పటికే పోలీసు శాఖ చర్యలు చేపడుతుండగా.. ఇవాళ పవన్ కూడా తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
ఇదే క్రమంలో అంజూ యాదవ్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ మహిళా సీఐ అంజూ యాదవ్ పై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై రాయలసీమలో బీసీ సంఘాలు నిరసనలకు దిగాయి. బీసీ మహిళా సీఐని టార్గెట్ చేస్తున్నారంటూ పవన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అంజూ యాదవ్ కు మద్దతు ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఆమెపై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్ పైనా శ్రీకాంత్ మండిపడ్డారు.

పవన్‌కల్యాణ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంజూయాదవ్‌కి క్షమాపణ చెప్పాలని రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ ఆమెను వ్యక్తిగతంగా దూషించిన తన కార్యకర్తను మందలించకుండా.. తిరిగి ఆమెపైనే ఫిర్యాదు చేయడం సబబు కాదన్నారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించకూడదన్నారు. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లయింది. వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ పై పవన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు అంజూ యాదవ్ గురించి ప్రస్తావిస్తూ శ్రీకాంత్ రెడ్డి.. ఇదే వ్యవస్థ లేకపోతే నీలాంటి రౌడీషీటర్లు, నీలాంటి రెచ్చగొట్టేవారు మితిమీరిపోయి అలజడి సృష్టిస్తారని పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అందుకే మీపార్టీ జనసేన (జెస్‌పీ) కాకుండా రౌడీషీటర్ల పార్టీ (ఆర్‌ఎస్‌పీ)గా మారిపోయిందని విమర్శించారు. టీడీపీ దొంగల పార్టీ అనేది అందరికీ తెలిసిందేనని, దానితో మీరు చేతులు కలిపి వెళ్తున్నారని ఆరోపించారు. మీరు ఇలానే ఉంటే ప్రజలు మీ దగ్గరకు కూడా రాకుండా చీదరించుకుంటారన్నారు.












Click it and Unblock the Notifications