బిగ్ బాస్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ : షో రెడీ-కంటెస్టెంట్స్ ఫైనల్: నేటి నుంచి క్వారంటైన్ లో...!!

తెలుగు బుల్లితెర ప్రేక్షకుల కోసం మరో రియాల్టీ షో రెఢీ అయిపోయింది. చాలా రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తన్న బీగ్ బాస్ - 5 సీజన్ ప్రారంభించే ముహూర్తం అఫీషియల్ గా ఎనౌన్స్ అయింది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అనేక పేర్లు ప్రచారం లోకి వచ్చాయి. అందులో కొందరు ఖండించారు. మరి కొందరి పేర్ల పైన సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇదే సమయంలో జెమినీ టీవీలో జూనియర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు షో ప్రారంభం కావటంతో..ఇక, బిగ్ బాస్ -5 ఆలస్యం చేయకూడదని నిర్వాహకులు డిసైడ్ అయపోయారు.

నాగార్జున హోస్ట్ - డేట్ అఫీషియల్

దీంతో..స్టార్ మా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అందులో నాగార్జునతో ఒక ప్రోమో విడుదల చేసింది. అందులో టైం టు ఎండ్ ది బోర్ డమ్. సెప్టెంబర్ 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ -5 ప్రారంభం కానున్నట్లు ట్వీట్ చేసారు. క‌రోనా వ‌ల‌న కాస్త లేట్‌గా ప్రారంభం కానున్న ఈ షోకి సంబంధించి గ‌త కొద్దిరోజులుగా అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజ‌న్ 5కి ముందుగా రానా హోస్ట్ అన్నారు, కాని ప్రోమో విడుద‌లైన త‌ర్వాత మ‌ళ్లీ నాగార్జున‌నే హోస్ట్ చేయ‌నున్నార‌నేది ఖరారైంది.

క్వారంటైన్ లో కంటెస్టెంట్స్..

క్వారంటైన్ లో కంటెస్టెంట్స్..


ఇదే సమయంలో బిగ్ బాస్ -5 లో కంటెస్టెంట్స్ ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా..అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, కరోనా కారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లటానికి ముందే క్వారంటైన్ కు పంపాలని నిర్ణయించారు. అందుకోసం ఈ రోజు నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఐటీసీకి చెందిన ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వారందరికీ క్వారంటైన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 5వ తేదీన కంటెస్టెంట్స్ పరిచయ కార్యక్రమం ఉండనుంది. దీంతో నాలుగో తేదీన దానికి సంబంధించి షూటింగ్ జరగనుంది.

 కంటెస్టెంట్స్ దాదాపుగా ఖరారు..

కంటెస్టెంట్స్ దాదాపుగా ఖరారు..

ఇందు కోసం సెప్టెంబర్ 3వ తేదీ వరకు కంటెస్టెంట్స్ ను క్వారంటైన్ లోనే ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, కంటెస్టెంట్స్ లిస్టులో తాజాగా..అనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ , సింగర్ కోమలి, వర్షిణి, రఘు మాస్టర్, నవ్య స్వామి, సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ దుర్గారావు, యాంకర్ రవి, సరయు సుమన్, మహా న్యూస్ లహరి పేర్లు ఉన్నట్లుగ తెలుస్తోంది. అయితే, వీరిలో ఎవరు ఉన్నారు.. అసలు కంటెస్టెంట్లు ఎవరనేది ఆదివారం సాయంత్రం స్పెషల్ షో లో తేలిపోనుంది.

Recommended Video

    Nagarjuna Sagar : కనువిందు చేస్తున్న దృశ్యం 14 Gates Lifted | Srisailam || Oneindia Telugu
    తొలి రోజు పరిచయం..ఇక ఇదే సమయంలో

    తొలి రోజు పరిచయం..ఇక ఇదే సమయంలో

    ఇక, బిగ్ బాస్ -5 సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు ప్ర‌తి రోజు రాత్రి 10గం.ల‌కు ఈ షో ప్ర‌సారం కానుండ‌గా, శ‌ని,ఆదివారాల‌లో 9గం.ల‌కు మొద‌లు కానుంది. దీంతో..ఇక బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్దం అయిపోతోంది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ ప్రారంభ డేట్ అఫీషియ్ గా తెలిసిపోవటంతో.. ఇక, పోటీలో ఎవరెవరు ఫైనల్ అవుతారు.. ఎవరి సామర్ధ్యం ఏంటనే అంచనాలు మొదలు కానున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+