స్వలింగసంపర్కం: కోరిక తీర్చలేదని యువకుడి హత్య

Bisexual man kills a youth
హైదరాబాద్: ఓ రిటైర్డ్‌ ఉద్యోగి తన కోరిక తీర్చలేదనే ఆగ్రహంతో గుర్తు తెలియని యువకుడ్ని మూడంతస్థుల భవనం నుంచి తోసివేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. హస్తినాపురానికి చెందిన వి నర్సింహారావు(63) రాష్ట్ర పరిశ్రమలశా ఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యాడు. కొన్ని నెలలుగా సుభాష్‌ చందర్‌ అనే న్యాయవాది వద్ద స్టెనో-టైపిస్ట్‌గా పనిచేస్తున్నాడు.

న్యాయవాది కార్యాలయం నారాయణగూడలోని లింగంపల్లిలో గల అన్నపూర్ణ రెసిడెన్సీ భవనం మూడో అంతస్థులో ఉంది. స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డ నర్సింహారావు గత సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు కార్యాలయంలోనే ఉన్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో అబిడ్స్‌లోని తాజ్‌మహల్‌ హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. తర్వాత అక్కడ రోడ్డుపై ఉన్న ఓ యువకుడ్ని (22) తీసుకుని కార్యాలయానికి వచ్చాడు.

ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో అర్థరాత్రి 2 గంటల సమయంలో నర్సింహారావు ఆ యువకుడ్ని కార్యాలయం కిటికీ నుంచి బయటకు తోసివేశాడు. తీవ్రమైన గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి నర్సింహారావును అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడ్ని విచారించిన పోలీసులు స్వలింగ సంపర్కం కోసం జరిగిన ప్రయత్నమే యువకుడి హత్యకు దారితీసిందని తెలిపారు. నిందితుడు మాయమాటలు చెప్పి యువకుడ్ని అబిడ్స్‌ నుంచి తాను పనిచేస్తున్న న్యాయవాది కార్యాలయానికి తీసుకొచ్చాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో యువకుడ్ని కిటికీలో నుంచి తోసివేశాడని తెలిపారు. న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. మృతుడి వివరాలు తెలియలేదని, ఆధారాలు కూడా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.

సచివాలయ ఉద్యోగిపై ఉద్యోగిని దాడి

తెలంగాణ ఆర్థిక శాఖలో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎంవి రమణయ్యపై పంచాయతీరాజ్ ఉద్యోగిని సుబ్బులు దాడి చేసిందని మంగళవారం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మంగళవారం సాయంత్రం రమణయ్య దగ్గరకొచ్చిన సుబ్బులు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రమణయ్యపై దాడికి పాల్పడగా తోటి ఉద్యోగులు అడ్డుకున్నారు. అనంతరం రమణయ్య సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+