రాళ్ల దాడి: జగన్‌కు చేదు అనుభవం, ఎదుటే బాహాబాహీ

రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. జగన్ ఎదుటే రాజమండ్రిలోని పార్టీ కార్యాలయం పైన పార్టీలోని ఓ వర్గానికి చెందిన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నగర మేయర్ అభ్యర్థిని మార్చడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి నగర పాలక సంస్థ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని మార్చారు. మేయర్ అభ్యర్థిగా మహేశ్వరికి బదులుగా షర్మిలా రెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది. దీంతో మహేశ్వరి వర్గం జగన్ ఎదుటే పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి చేసింది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి.

Bitter experience to YS Jagan in Rajahmundry

అవసరమైనప్పుడు: మోహన్ బాబు

అవసరమైనప్పుడు రాజకీయాలు మాట్లాడతానని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు మంగళవారం అన్నారు. కుటుంబ సమేతంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం సముచితం కాదని, తాను మాట్లాడనని అన్నారు.

సినిమాల గురించి మాట్లాడతానని చెప్పిన ఆయన, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తాను, విష్ణు నటించిన రౌడీ సినిమా ఏప్రిల్‌లో విడుదలవుతుందని, అందులో తన నటన బాగుందో, తన కుమారుడు విష్ణు నటన బాగుందో అభిమానులే తేల్చాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+