'పవన్‌ను విమర్శిస్తే మమ్మల్ని విమర్శించుకోవడమే, మోడీకి తప్పుడు సమాచారం'
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం తొందరపాటుగా టిడిపి ఎంపీ మురళిమోహన్ అభిప్రాయపడ్డారు.ఏపీకి మంచి చేయాలనే తపన పవన్ కళ్యాణ్‌కు ఉందన్నారు. కాకపోతే ఆయనకు అంతగా అనుభవం లేకపోవడం, సన్నిహితులు ఇచ్చే సలహలతో కొంచెం తొందరపడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
Recommended Video

టిడిపి ఎంపీ మురళీమోహన్‌ను ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఆదివారం నాడు ఇంటర్వ్యూ చేసింది తన రాజకీయ జీవితంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మురళీమోహన్ తన అభిప్రాయాలను వెల్లడించారు.
బిజెపి ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని ఆయన చెప్పారు. అయితే రాష్ట్రాభివృద్ది కోసం తాము పోటీ పడుతామని చెప్పారు.

పవన్ కళ్యాణ్ తొందరపడ్డారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై , మంత్రి లోకేష్‌పై విమర్శలు చేయడంలో తొందరపడ్డారని టిడిపి ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్‌కు కూడ ఏపీకి మంచి చేయాలనే తపన, ఆవేశం ఉందన్నారు. అయితే ఆవేశంతో పనిచేయడం వల్ల కొన్ని సమయాల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌కు సలహలు ఇచ్చిన వారి కారణంగానే పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకొన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

పవన్ ను విమర్శిస్తే మమ్మల్ని మేం విమర్శించుకోవడమే
చంద్రబాబునాయుడు వల్లే రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందని అలాంటి నాయకుడు మనకు భవిష్యత్ లో కూడా ఉండాలని ఇంతకుముందు పవన్ కల్యాణ్ చెప్పారని మురళీ మోహన్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఎందుకు . యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఆరోపణలు గుప్పించడాన్ని తొందరపాటు చర్యగా మురళీమోహన్ అభిప్రాయపడ్డారు.పవన్ ని తానేమీ విమర్శించడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే తమను తాము విమర్శించుకున్నట్టేనని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు.

జగన్ కు ఏం చరిత్ర ఉంది
ఏపీని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబునాయుడుకు ఉన్నంత అనుభవం వైసీపీ చీఫ్ జగన్‌కు లేదని టిడిపి ఎంపీ మురళీమోహన్ చెప్పారు. వైఎస్ జగన్‌కు చరిత్ర ఏముందని ఆయన ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యమే తమ ధ్యేయమని చెప్పారు.

బిజెపిలో పార్టీ విస్తరణ పెరిగింది
దేశంలో బిజెపికి పార్టీ విస్తరణ కాంక్ష పెరిగిందన్నారు. ఆ కాంక్ష మేరకే బిజెపి పథకం ప్రకారంగా వ్యవహరించిందన్నారు. అయితే ఏపీకి చెందిన బిజెపి నేతలు మోడీకి ఏపీకి సంబంధించిన రాజకీయ పరిస్థితులపై తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. బిజెపి నేతలు పథకం ప్రకారంగా వ్యవహరించారని చెప్పారు. ఎన్డీఏ నుండి తమను పథకం ప్రకారంగా బయటకు పంపారని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు.

నా కోడలికి టిక్కెట్టు విషయమై బాబుదే నిర్ణయం
తనకు కొంత కాలం క్రితం అనారోగ్యం కారణంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి నెలకొన్న సమయంలో మా కోడలు రూప రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపారని ఆయన గుర్తు చేశారు. తన కంటే ఎక్కువగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తన కోడలు రూప చొరవ చూపుతారని ఆయన చెప్పారు. అయితే ఆమెకు టిక్కెట్టు ఇవ్వాలని తాను ఏనాడూ కోరుకోలేదని చెప్పారు. చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకే నిర్ణయం నడుచుకొంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications