Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ చీఫ్ గా ఏపీ నేత - ఊహించని రాజకీయం..!!

ప్రధాని మోదీ - షా ద్వయం కీలక నిర్ణయాలకు సమాయత్తం అవుతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన వక్ఫ్ బిల్లు ఆమోదంతో తదుపరి కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల పైన గురి పెట్టిన మోదీ - షా ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా రాష్ట్రాలకు అధ్యక్షులను ఖరారు చేస్తున్నారు. ఈ మేరకు సూత్ర ప్రాయంగా ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఈ ఇద్దరూ పార్టీ నేషనల్ చీఫ్ గా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికే ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

బీజేపీ చీఫ్ గా
బీజేపీ అధినాయకత్వం కీలక ప్రకటనకు సిద్దం అవుతోంది. జాతీయ అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రాల కు చెందిన నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న వేళ దక్షిణాది పైన స్పెషల్ ఫోకస్ చేసారు. అందులో భాగంగా ఆరెస్సెస్ నేపథ్యం.. బీజేపీలో పలు హోదాల్లో కొనసాగిన ఏపీకి చెందిన నేత రామ్ మాధవ్ పేరు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కీలకంగా పని చేసారు. 1981లో ఆయన ఆరెస్సెస్ లో చేరారు. ఆ తరువాత దశాబ్దాల పాటు ఎంతో సేవ చేశారు 2014లో బీజేపీలో చేరి జమ్మూ కాశ్మీర్ లో ఆ పార్టీ తరపున కీలక పాత్ర పోషించారు. జమ్మూలో పీడీఎఫ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో రామ్ మాధవ్ కీలకంగా వ్యవహరించారు.

bjp-high-command-likely-to-appoint-party-national-chief-from-telugu-states

ఆరెస్సెస్ సిఫార్సు
ఏపీలోని అమలాపురంకు చెందిన రామ్ మాధవ్ కు ఆరెస్సెస్ నేపథ్యం కలిసి వచ్చే అంశం. ఉన్నత విద్యా వంతుడు అయిన రామ్ మాధవ్ కు ఇవ్వటం ద్వారా పార్టీ - ప్రభుత్వ సమన్వయం తో పాటుగా పూర్తి స్థాయిలో ఆరెస్సెస్ మద్దతు కూడగట్టవచ్చని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు సైతం నేషనల్ చీఫ్ పదవి కోసం పరిశీలనకు వచ్చింది. అందుకు కిషన్ రెడ్డి సముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. బీజేపీ వరుసగా గెలిచిన హర్యానా, మహారాష్ట్ర, డిల్లీలో ఆరెస్సెస్ ప్రణాళికా బద్దంగా బీజేపీ విజయానికి పని చేసింది. జమిలికి సిద్దం అవుతున్న వేళ ఆరెస్సెస్ పాత్ర క్రియాశీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో, రామ్ మాధవ్ పార్టీలో పలు కీలక సందర్భాల్లో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారనే గుర్తింపు ఉంది. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయాధ్యక్షులుగా పని చేసారు.

Take a Poll

తెలుగు రాష్ట్రాలకు

దీంతో, చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా రామ్ మాధవ్ కు బీజేపీ పగ్గాలు అప్పగింత ఖాయంగా కనిపిస్తోంది. ఇక.. ఏపీలో కొత్త అధ్యక్షుడి నియామకం పైన తుది నిర్ణయం జరగలేదు. మరి కొద్ది రోజులు పురందేశ్వరి కొనసాగింపు అంశం పరిశీలిస్తున్నట్ల తెలుస్తోంది. తెలంగాణలో బండి సంజయ్ ను తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు మరింత అలర్ట్ అవుతోంది. అధ్యక్షుడితో పాటుగా పార్టీలో కీల క మార్పులకు సమాయత్తం అయినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో, అందరినీ కలుపుకొని ముందుకెళ్లే నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని డిసైడ్ అయింది. అధ్యక్షుడి ముది రాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటల రాజేందర్‌ పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈటెల పేరు ప్రకటన సమయంలో సీనియర్లు తుది ప్రయత్నాలు చేస్తున్నారు. అనూహ్యంగా మురళీధర్‌ రావు, డీకే అరుణ పేర్లు తెర మీదకు వచ్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+