బీజేపీ ఆపరేషన్ ఏపీ, "మెగా" స్కెచ్ - ఆట మొదలు..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమిలోని మూడు పార్టీలు జట్టు గా కొనసాగుతూనే.. తమ పునాదులు బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాయి. జనసేనాని పవన్ సైతం పార్టీని వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీని సంస్థాగతంగా బలం పెంచుకునేలా కొత్త వ్యూహా లతో సిద్దం అవుతున్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ మరింత బలోపేతం కావాలని భావిస్తోంది. ఈ సమయంలోనే బీజేపీ కొత్త ఎత్తుగడలతో ఆపరేషన్ ఏపీకి రెడీ అవుతోంది. అందులో భాగంగా మెగా సమీకరణాలను తెర మీదకు తెస్తోంది. ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయం జరగనుంది.

బీజేపీ కొత్త సమీకరణాలు
బీజేపీ కేంద్ర నాయకత్వం జమిలి దిశగా అడుగులు వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో జమిలి నాటికి తమ పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా కర్ణాటక, తెలంగాణతో పాటుగా ఏపీలో నూ తమ బలం పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతోంది. ఏపీకి గతం కంటే భిన్నంగా కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. విమర్శలకు అవకాశం లేకుండా కీలక అంశాల్లో స్పందిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. పవన్ ఇటు చంద్రబాబుతో పాటుగా అటు కేంద్రంలో ప్రధాని మోదీతో నూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ బీజేపీ ముఖ్య నేతలు పవన్ కు ప్రయార్టీ పెంచుతూ కొత్త సంకేతాలు ఇస్తున్నారు.

BJP High Command moving with big sketch to strengthen the party in AP new president to appoint

పవన్ కు ప్రాధాన్యత
ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీజేపీ కొత్త నిర్ణయాలు అమలుకు సిద్దం అయింది. బీసీ నేతగా గుర్తింపు ఉన్న ఆర్ క్రిష్ణయ్య తాజాగా వైసీపీకి రాజీనామా చేసారు. ఆయన్ను బీజేపీలో చేర్చుకోనుంది. రాజ్యసభ సీటు ఇప్పటికే క్రిష్ణయ్య కు ఖరారు చేసింది. క్రిష్ణయ్య ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీ వర్గాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో పవన్ తో సంబంధాలు భవిష్యత్ కు ఉపయోగపడేలా ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తోంది. పవన్ తాజా ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలు ఇచ్చిన ప్రాధాన్యత కొత్త చర్చకు కారణం అవుతోంది. బీజేపీ ముఖ్య నేతలు ఏపీలోనూ సొంతంగా బలపడేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే లా కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు.

బీజేపీకి కొత్త అధ్యక్షుడు
ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు నియామకం కాను న్నారు. ఏపీలో టీడీపీ, జనసేన కు రెండు ప్రధాన సామాజిక వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో, బీజేపీ అనూహ్యంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమించా లని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గాలను దగ్గర చేసుకోవటం పైనా గురి పెట్టింది. పవన్ సనాతన ధర్మం నినాదం.. పవన్ తరచూ స్పందిస్తున్న విధానంతో తమకు జనసేన తో కలిసి వస్తుందని లెక్కలు వేస్తోంది. దీంతో, రానున్న రోజుల్లో బీజేపీ ఏపీలో తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+