ప్రతిష్టంభన: బాబుకి వెంకయ్య షాక్, సవాల్‌లతో పుడ్తోంది
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు షాకిచ్చారు. తెలుగుదేశం, బిజెపి పొత్తుల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ఆయన ఆదివారం అన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో అవసరమైతే ఒంటరిపోరుకు సిద్ధం కావాలని తాము శ్రేణులకు సూచించామన్నారు.
ఎపిలో, తెలంగాణలో పొత్తుల విషయం ప్రకాశ్ జవదేకర్, అరుణ్ జైట్లీలు చూస్తున్నారని చెప్పారు. ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని, శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ రేపు సమావేశం కానుందని వెంకయ్య అన్నారు. టిడిపితో పొత్తుల చర్చలు ముందుకు సాగటం లేదన్నారు.

సమర్థవంతమైన నాయకత్వం లేని కారణంగా దేశం పురోగమనం నుంచి తిరోగమనం వైపు పయనిస్తోందని వేరుగా అన్నారు. గట్టి ప్రభుత్వం, స్థిరమైన నాయకత్వం ఉంటేనే సవాళ్లు అధిగమిస్తామన్నారు. మోడీ వంటి వారు నాయకుడు అయితే ఇంకా సమర్థవంతంగా దేశాన్ని పాలించుకోవచ్చునన్నారు.
రాష్ట్రం విడిపోయినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావన్నారు. హైదరాబాదులో తెలంగాణ ఉన్నంత మాత్రాన ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి కాలేదని, అదే రీతిలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ పుట్టడమే సవాల్‌లతో పుడుతోందని వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులకు బిజెపి అండగా ఉంటుందన్నారు.
పొత్తులపై మాట్లాడే పరిస్థితి లేదు: హరిబాబు
ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఇతర పార్టీలతో పొత్తులపై మాట్లాడే పరిస్థితి లేదని బిజెపి సీమాంధ్ర ప్రాంత చీఫ్ హరిబాబు అన్నారు.












Click it and Unblock the Notifications