ఏపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ హైకమాండ్ తాజా అంచనాలు..!!
ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారింది. జగన్ వర్సస్ చంద్రబాబు కేంద్రంగా ఎన్నికల రాజకీయం కొనసాగుతోంది. మేనిఫెస్టోల పైన స్పష్టత వచ్చేసింది. మరో 10 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇదే సమయంలో గెలుపు పైన అటు జగన్..ఇటు చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకత్వం ఏపీలో పరిస్థితుల పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తు్నారు. ఏపీలో అధికారం పైన బీజేపీ నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీలో గెలిచేదెవరు
ఏపీలో ఎన్నికల్లో గెలిచేదెవరు. ఇప్పుడు ఏపీలోనే కాదు..ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే అంశం ఆసక్తిని పెంచుతోంది. ఏపీలో మూడు పార్టీల కూటమితో జగన్ తల పడుతున్నారు. మరో వైపు కాంగ్రెస్, వామపక్షాల కూటమి పోటీ చేస్తోంది. జగన్ పూర్తిగా తన సంక్షేమ ఓట్ బ్యాంక్ నే నమ్ముకున్నారు. చంద్రబాబు సంక్షేమంతో పాటుగా ఏపీకి భవిష్యత్ ఇస్తామనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా టీడీపీ కూటమి మేనిఫెస్టో ప్రకటించింది. ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో ఫలితాల పైన తమ అంచనాలను వెల్లడించాయి. తాజాగా బీజేపీ ముఖ్య నేత ఏపీలో అధికారం ఎవరిదో చెప్పుకొచ్చారు.

కూటమివి వచ్చే సీట్లు
ఏపీలో ఎన్డీఏకు 110 కి పైగా అసెంబ్లీ, 18-20 లోక్ సభ స్థానాలు వస్తాయని తమ పార్టీ అంతర్గత సర్వేలో తేలిందని బీజేపీ ముఖ్య నేత జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. తెలంగాణలో బీజేపీకి 9-10 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంటుందని..గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని వివరించారు.దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని , దీంతో తమ పార్టీకి సానుకూల వాతావరణం పెరుగుతుందని విశ్లేషించారు. కేజ్రీవాల్, కవిత అరెస్ట్ అంశాలు తమకు ఎలాంటి నష్టం చేయవని ధీమా వ్యక్తం చేసారు. కేజ్రీవాల్ అరెస్ట్ తో ఆప్ అవినీతి ప్రజల్లోకి బలంగా వెళ్లిందని వివరించారు.

బీజేపీ గెలిచే సీట్లు
ఏపీలో బీజేపీ 5 ఎంపీ, 5 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని జీవీఎల్ జోస్యం చెప్పారు. గాజు గ్లాసు స్వతంత్రులకు కేటాయించటంతో కొంత గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. మే 6వతేదీ లోగా అనేక ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీలో కూటమి మరింత పంజుకోవాలంటే ప్రధాని మోద పేరు ఇంకా ఎక్కవ ప్రచారం చేయాలని చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు ఏపీలో ఎన్నికల ఫలితాల అంచనాల పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. అటు పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఓటర్లను ఆకట్టుకోవటానికి పోటీలో ఉన్న అభ్యర్దులు తమ వంతు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications