గురు పూర్ణిమ విశిష్టత.. ఇలా చేస్తే మీకు సుఖ సంతోషాలు!
గురు పూర్ణిమ చాలా పవిత్రమైన, ప్రత్యేకమైన, విశేషమైన రోజు. గురు పూర్ణిమ రోజున మనం చేసే మంచి పనులు, గురు భక్తిని కలిగి ఉండటం వంటి అంశాలు మన జీవితంలో శుభ ఫలితాలను ఇస్తాయి. గురు పూర్ణిమ రోజున దానధర్మాలను చేయడం చాలా మంచిది. సహజంగా గురు పూర్ణిమ రోజు చేయవలసిందేమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
గురు పూర్ణిమ జరుపుకునేది ఇందుకే
ప్రతి సంవత్సరం మనం గురుపూర్ణిమ పండుగను ఆషాడమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తిధిన జరుపుకుంటాం. గురుపూర్ణిమనే ఆషాడ పూర్ణిమ అని కూడా అంటారు. అనాదిగా వేద వ్యాసుడు జన్మించిన రోజుని గురు పూర్ణిమగా జరుపుకోవాలన్నది ఆనవాయితీ. మహాభారతం వంటి గొప్ప గ్రంధాన్ని రచించిన వేదవ్యాసుడుని గొప్ప గురువుగా భావించి గురుపూర్ణిమను జరుపుకుంటాము.

గురు పూర్ణిమ తిధి
ఈ సంవత్సరం గురు పూర్ణిమ జులై 29వ తేదీన వచ్చింది. గురుపూర్ణిమ తిది జులై 28 సాయంత్రం 6.18 నిముషాలకు ప్రారంభం అవుతుంది. జులై 29 తేదీన రాత్రి 8.05 నిముషాలకు ముగుస్తుంది.అయితే మనం ఉదయం ఉన్న తిధిని ప్రామాణికంగా తీసుకుంటాం, పౌర్ణమికి చంద్రోదయ కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి రెండూ కలిసేలా జులై 29 ఉంది కాబట్టి రేపు గురు పూర్ణిమను జరుపుకోనున్నాం.
గురు పూర్ణిమకు ఇలా చేస్తే మంచిది
గురు పూర్ణిమ పర్వ దినాన దానధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని, సుఖసంతోషాలు వస్తాయని చెబుతున్నారు. భగవంతుడిని పూజించటంతో పాటు దానధర్మాలకు హిందూ ధర్మంలో స్థానం ఉంది. కాబట్టి నేడు దాన ధర్మాలు చేస్తే మంచిది. ఇంట్లో పూజ నిర్వహించుకోవటంతో పాటు, గురువులను పూజిస్తే మంచిది. జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవటం ఉత్తమం.
గురు పూర్ణిమ పూజలు, దానాలతో ఫలితం ఇలా
గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి పూజలు చేస్తారో వారికి మంచి ఫలితం వస్తుంది. శ్రీమహావిష్ణువుని ధ్యానం చేసి, విష్ణువుకు పసుపు పువ్వులు, పసుపు వస్త్రాలను సమర్పించి పూజిస్తారో, ఎవరైతే గురువును పూజిస్తారో వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయని, వారికి ఐశ్వర్యం వస్తుందని చెబుతున్నారు. గురుపూర్ణిమ నాడు దానధర్మాలు చేయడం వల్ల కెరీర్లో పురోగతి వస్తుందని, అన్ని పనులలోను విజయం లభిస్తుందని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications