PM Kisan - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఫిక్స్, ఖాతాల్లో రూ 6 వేలు..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ పై కీలక సమాచారం. రైతులు 24వ విడత నిధుల కోసం వేచి చూస్తున్న వేళ బిగ్ అప్డేట్ అందుతోంది. వరుస పండుగలు.. ఎల్ నినో కష్టాల వేళ రైతుల ఖాతాల్లో నిధుల జమ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం విడుదల చేస్తున్న పీఎం కిసాన్ నిధులతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మలి విడత నిధుల జమకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు ఈ నిధులు జమ కానున్నాయి.
రైతులకు కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్. పీఎం కిసాన్ 24వ విడత నిధుల జమ పైన కేంద్రం సిద్దం అవుతోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలలో పంపిణీ చేస్తున్నారు. ప్రతి విడత రూ.2,000 చొప్పున నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద విడతలు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. చివరి విడత అయిన 23వ విడత జూన్‌లో విడుదలైంది. దీంతో.. 24వ విడత నిధుల జమ పైన చర్చ సాగుతోంది. ఈ నెలలోనే తొలుత విడదల చేయాలని భావించారు. వినాయక చవితి వేళ ఈ నిధులు జమ చేయాలని ఆలోచన చేసారు. అయితే, కేంద్రంలో ఈ మేరకు తాజాగా జరిగిన చర్చల్లో విజయ దశమికి ముందే అక్టోబర్ 17న ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నవరాత్రుల వేళ రైతుల ఖాతాల్లో జమ
కాగా.. ఈ పథకంలో నిధులు పొందే రైతులు తమ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తు న్నారు. రైతులు ఇంకా తమ ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే, వారి తదుపరి వాయిదా జమ నిలుపుదల చేసే అవకాశం ఉందని చబుతున్నారు. పీఎం కిసాన్ వాయిదా స్థితిని తెలుసుకోవాల నుకుంటే రైతులు ఆన్‌లైన్ లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అదే విధంగా పీఎం కిసాన్ నిధుల జమ సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయనుంది. గత ఏడాదిన్నార కాలంగా కేంద్ర నిధులతో పాటుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. కేంద్రం ఇచ్చే రూ 6 వేలతో పాటుగా ఏపీ ప్రభుత్వం రూ 14 వేలు అందిస్తోంది. దీని ద్వారా ఏపీలోని రైతులకు వచ్చే నెల అటు కేంద్రం.. ఇటు ఏపీ ప్రభుత్వం అందించే రూ 6 వేలు ఒకే విడత రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications
