"బాస్ కన్నా ఎత్తైన చైర్ లో కూర్చొన్న సార్..!"- వైసీపీ కొత్త స్నేహంపై సాయిరెడ్డి పంచ్..!

ఏపీలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఎప్పుడూ ఒంటరి పోరుకే మొగ్గు చూపే వైఎస్సార్సీపీ ఈసారి అనూహ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వంపై పోరాటం కోసం ఓ కొత్త స్నేహితుడిని వెతుక్కుంది. అదే సీపీఐ. నిత్యం ప్రభుత్వాలపై అసమ్మతి ప్రదర్శించే కమ్యూనిస్టు రాజకీయాలకు రాష్ట్రంలో కాలం చెల్లిందని అందరూ లైట్ తీసుకుంటున్న వేళ.. వాటిలో భాగమైన సీపీఐ నేతల్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా భేటీ అయ్యారు.

వైసీపీ శాప్ ముట్టడిపై ఏపీ సర్కార్ సీరియస్..! పోలీసులకు కీలక ఆదేశాలు..!
వైసీపీ శాప్ ముట్టడిపై ఏపీ సర్కార్ సీరియస్..! పోలీసులకు కీలక ఆదేశాలు..!

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీ రాష్ట్రంలో కొత్త చర్చలకు తెరలేపింది. ఇందులో స్థానిక సంస్థల వేళ స్థానిక సమస్యలపై నిత్యం పోరాటాలు చేసే కమ్యూనిస్టులతో కలిసి తామూ పోరాటం చేయాలని భావించడం వల్లే వైసీపీ ఇలా చర్చలు జరిపిందని కొందరు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సీపీఐతో పొత్తుకు తెరలేచిందని మరికొందరు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఒకప్పుడు చక్రం తిప్పి, అనంతరం అనూహ్యంగా దూరమై, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న విజయసాయిరెడ్డి (vijayasai reddy) మాత్రం ఈ రెండు వాదనల కన్నా భిన్నంగా స్పందించారు.

vijayasai reddy targets sajjala Ramakrishna over ysrcp-cpi talks
జగన్ ను కలిసిన బొత్స అనూష..! మజ్జి శ్రీనుకు కౌంటర్ స్ట్రాటజీ ఖరారు..!
జగన్ ను కలిసిన బొత్స అనూష..! మజ్జి శ్రీనుకు కౌంటర్ స్ట్రాటజీ ఖరారు..!

వైయస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండి కూటమిలో ఉన్న సీపీఐతో కలిసి 'ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం' చేయటానికి నిర్ణయించుకున్నాయి అని ఈ రోజు సాక్షి పత్రికలో ప్రకటించారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ అధ్యక్షుడికన్నా ఎత్తు కుర్చీలో కూర్చున్న సార్‌గారు (సజ్జల రామకృష్ణారెడ్డి), తన మాజీ పార్టీతో ( మాజీ కమ్యూనిస్టు) జరిపించిన ఈ ఒప్పందం వల్ల పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది వైయస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణుల ఆలోచనకే వదిలేస్తున్నా..అంటూ సాయిరెడ్డి కొత్త ప్రశ్నల్ని లేవనెత్తారు. అంటే వైసీపీ-సీపీఐ కొత్త స్నేహం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నట్లు ఆయన విశ్లేషించారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆలోచించాల్సిన అవసరం ఎందుకు ఉంటుందో సాయిరెడ్డి చెప్పలేదు. తద్వారా వారిని ఈ అంశంపై ఆలోచించాలంటూ సాయిరెడ్డి సలహా ఇచ్చినట్లు కనిపిస్తోంది. సాయిరెడ్డి ప్రశ్నలు ఎలా ఉన్నా దేశంలో రాజకీయ పరిస్దితులు మారుతున్న వేళ వైఎస్సార్సీపీ భవిష్యత్తుకు సీపీఐ పొత్తు దారులు తెరుస్తుందా లేదా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+