సీఎం విజయ్ తో వైఎస్సార్సీపీ ఎంపీ భేటీ..! తొలిసారి ఇలా..!

ఏపీలో అరకు వైఎస్సార్సీపీ ఎంపీ గుమ్మ తనూజరాణి (Gumma Thanuja Rani) ఇవాళ తమిళనాడు వెళ్లి సీఎం విజయ్ (CM Vijay)తో భేటీ అయ్యారు. తనతో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకుని అక్కడికి వెళ్లారు. దీంతో విజయ్ కూడా వీరికి స్వాగతం పలికారు. ఆత్మీయంగా కలిసి మాట్లాడారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు. ఏపీ రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఓ కీలక కారణం కూడా ఉంది. ఈ విషయాన్ని ఎంపీ తనూజరాణి స్వయంగా ట్వీట్ కూడా చేశారు.

పార్లమెంటరీ పట్టణ, అభివృద్ధి అధ్యయన పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ను తమిళనాడు సచివాలయంలో కలిసినట్లు తనూజరాణి తెలిపారు. విజయ్ తో తనూజరాణి, ఆమె భర్త, వైసీపీ నేత చెట్టి వినయ్ కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన అరకు ఎంపీ దంపతులకు సీఎం విజయ్.. ఆత్మీయంగా ఓ జ్ఞాపిక కూడా అందజేశారు. ఈ భేటీలో అరకు గిరిజన మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెట్ట వికాస్ కూడా పాల్గొన్నారని ఎంపీ తనూజ తెలిపారు.

YSRCP MP Thanuja Rani Meets Tamil Nadu CM Vijay With Family Here s the Reason

గతంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ను సీఎం కాకముందే విజయ్ చెన్నైలో జరిగిన ఓ వ్యక్తిగత కార్యక్రమంలో కలిశారు. అప్పట్లో జగన్ సోదరుడి పెళ్లి సందర్భంగా విజయ్ అక్కడికి రావడంతో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆ తర్వాత మాత్రం వైసీపీ నేతలు ఎక్కడా విజయ్ తో కనిపించలేదు. కానీ ఇప్పుడు అరకు ఎంపీ తనూజరాణి ఏకంగా కుటుంబంతో కలిసి వెళ్లి విజయ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదీ పార్లమెంటరీ పట్టణాభివృద్ధి అధ్యయన పర్యటన కోసం అక్కడికి వెళ్లినట్లు ఎంపీ తనూజరాణి స్వయంగా ట్వీట్ చేయడంతో ఊహాగానాలకు కూడా తావులేకుండా పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+