"ఊహకైనా హద్దుండాలిగా "- తాజా సర్వేతో టార్గెట్ అయిన విజయ్..!

దేశవ్యాప్తంగా తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా టుడే .. సీ ఓటర్ తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది. వీటి ఫలితాల్ని తాజాగా ప్రకటించింది. ఇందులో పలు సంచలనాలు నమోదయ్యాయి. వీటిలో ప్రధాన మంత్రి (Prime Minister) రేసులో మోడీ, రాహుల్ గాంధీ తర్వాత మూడో స్ధానంలో విజయ్ (Vijay) ఉండటం కూడా ఒకటి. ఈ అంచనా తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం విజయ్ రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లు మాత్రమే కావడం, ప్రస్తుతం అరకొర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతుండటమే.

ప్రధాని రేసులో విజయ్ దూకుడు.. మహామహానేతలను వెనక్కి నెట్టిన TVK అధినేత!
ప్రధాని రేసులో విజయ్ దూకుడు.. మహామహానేతలను వెనక్కి నెట్టిన TVK అధినేత!

అయితే దేశవ్యాప్తంగా అభిప్రాయాలు ఎలా ఉన్నా ఆయన స్వరాష్ట్రం తమిళనాడులో మాత్రం ఇండియా టుడే సర్వే ఫలితాలపై దాదాపు అన్ని ప్రధాన పార్టీలు పెదవి విరుస్తున్నాయి. ఇందులో విజయ్ ప్రస్తుతం నడుపుతున్న కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ కూడా ఉంది. అయితే గియితే తమ నాయకుడు రాహుల్ గాందీ ప్రధాని కావాలి కానీ, విజయ్ కావడమేంటన్నది కాంగ్రెస్ ప్రశ్న. అలాగే విపక్ష డీఎంకే కూడా విజయ్ ప్రధాని రేసులో ఉన్నారంటూ వచ్చిన సర్వేపై విమర్శలు ఎక్కుపెడుతోంది.

After Vijay Ranks 3rd in PM Survey DMK Mocks TVK Pitch Congress Backs Rahul
తమిళనాట ఉపఎన్నికల టెన్షన్ ? - విపక్షాల షాక్ తో హైకోర్టుపైనే విజయ్ ఆశలు..!
తమిళనాట ఉపఎన్నికల టెన్షన్ ? - విపక్షాల షాక్ తో హైకోర్టుపైనే విజయ్ ఆశలు..!

డీఎంకే నేత ఆర్.ఎస్.భారతి.. విజయ్ ప్రధాని అవుతారన్న టీవీకే ప్రచారాన్ని ఎగతాళి చేస్తూ వారి ఊహలకు హద్దులే లేవంటూ వ్యాఖ్యానించారు. విజయ్ ను ప్రధాని అభ్యర్ధి రేసులో నిలబెట్టేందుకు టీవీకే చేస్తున్న ప్రయత్నాలపై సెటైర్లు వేశారు. టీవీకే సభ్యులు మాట్లాడితే, ఆయన ఐక్యరాజ్యసమితికి కూడా అధిపతి అవుతారని అంటారు, ఊహలు, ఊహలు, వారి ఊహలకు అంతులేదు, వారు ఏమనుకుంటే అది అనుకోనివ్వండి అన్నారు. మరోవైపు 2029లో రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వకపోతే విజయ్ మంత్రివర్గం నుంచి వైదొలుగుతామని కాంగ్రెస్ హెచ్చరించగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్.. విజయ్ పేరు ప్రస్తావించకుండా లేదా ప్రధానమంత్రి ప్రాధాన్యతా సర్వేను నేరుగా ప్రస్తావించకుండా, ప్రతి సంఖ్య నిజం చెప్పదు. ప్రతి సర్వే ప్రజల గొంతుక కాదంంటూ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+