సంచలన సర్వే: తెలంగాణలో ఆ పార్టీ సీన్ రివర్స్, ఇక వారిదే హవా- ఎవరికి ఎన్ని సీట్లు..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీ లు వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే చెబుతూ ఉన్నారు. ఈ సమయంలోనే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టూడే సర్వేలో తెలంగాణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో.. పార్టీలు అలర్ట్ అయ్యాయి.

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ మరో సారి తానే సీఎం అవుతానని పదే పదే చెబుతున్నా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వం పైన భారీ స్థాయి లో వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. ఈ సమయంలోనే ఇండియా టుడే - సీఓటర్ నిర్వహించి న 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే ప్రకారం, తెలంగాణలో బీజేపీ-ఎన్డీయే బలం పుంజుకుంటున్నట్లు వెల్లడైంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే (NDA) కూటమికి 9 స్థానాలు వరకు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని, క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడుతోందని ఈ సర్వే ఫలితాలు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లు కోల్పోతున్నట్లు తాజాగా సర్వేలో స్పష్టం చేసారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ బలగం సగానికి సగం పడిపోయి, కేవలం నాలుగు స్థానాలకే పరిమితమవుతుందని సర్వే తేల్చింది.

 మూడ్ ఆఫ్ ఏపీ: ఏ పార్టీకి ఎన్ని సీట్లు, గెలుపు ఎక్కడ - వారికి డేంజర్ బెల్స్, బిగ్ ఛేంజ్...!!
మూడ్ ఆఫ్ ఏపీ: ఏ పార్టీకి ఎన్ని సీట్లు, గెలుపు ఎక్కడ - వారికి డేంజర్ బెల్స్, బిగ్ ఛేంజ్...!!
telangana-motn-survey-nda-projected-to-win-9-of-17-lok-sabha-seats-india-bloc-may-slip-to-4-seats

మారుతున్న లెక్కలు

ఈ సర్వేలో దేశ వ్యాప్తంగా ఎన్డీఏ బలంగా ఉందని స్పష్టం చేసారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ బల పడుతోందని విశ్లేషించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో ఈ సర్వే షాకింగ్ గా మారుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ తన పట్టును మరింత పెంచుకొనే అవకాశాలు కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుచుకున్న 8 స్థానాల నుంచి మరో స్థానాన్ని అదనంగా సొంతం చేసుకుని 9 సీట్లకు చేరుకుంటుందని సర్వే లో తేల్చారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ కోలుకుని 3 లోక్‌సభ స్థానాలను సొంతం చేసుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఎంఐఎం ఒక సీటు గెలుస్తుందని అంచనా వేసింది. దీంతో.. ఇప్పుడు తెలంగాణలో ఈ సర్వే పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+