స్థానిక ఎన్నికలకు పవన్ పక్కా స్కెచ్, కొత్త లెక్కలు..!!

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ పవన్ నిర్ణయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ వైఖరి పైన పవన్ స్పష్టత ఇచ్చారు. మిత్ర ధర్మం పాటిస్తూనే... పార్టీ శ్రేణుల ఆత్మగౌరవం కాపాడే విధం గా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్దేశించారు. ఇందు కోసం ఫ్రెండ్లీ కాంటెస్ట్ విధానం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు కూటమిలో సంచలనంగా మారుతోంది. కాగా.. పవన్ స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి.. కొత్త వ్యూహాలను ఫిక్స్ చేసారు. పవన్ తాజా నిర్ణయాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.

స్థానిక ఎన్నికలను డిప్యూటీ సీఎం పవన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, కూటమి భాగస్వామ్య పక్షాలతో పక్కా సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కొత్త కమిటీ ఇప్పటికే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న 14 మంది సభ్యుల ప్రధాన కమిటీతో కలిసి సంయుక్తంగా పని చేయనుంది. ఈ ఐదుగురు సభ్యుల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్య టించనుంది. వివిధ జిల్లాల్లో పార్టీ బలాబలాలు, డివిజన్లు మరియు స్థానిక సంస్థల వారీగా అభ్య ర్థుల గెలుపు అవకాశాలు, పొత్తుల సమన్వయంలో ఎదురవుతున్న సవాళ్లపై లోతుగా అధ్యయనం చేసి ఈ ప్రత్యేక టీమ్ ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయనుంది. క్షేత్రస్థాయి నుంచి సేకరించి సమర్పించే నివేదికల ఆధారంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

పవన్ తో వంగవీటి రాధా ఆకస్మిక భేటీ వెనుక..!?
పవన్ తో వంగవీటి రాధా ఆకస్మిక భేటీ వెనుక..!?
janasena-chief-pawan-kalyan-appoints-new-committees-for-local-body-elections-fixed-big-task-for-par

స్థానిక ఎన్నికల పై పవన్ ప్రత్యేక ఫోకస్

పార్టీ అధినేత పవన్ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలు, సీట్ల సర్దుబాట్లపై పవన్ కల్యాణ్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల వేళ సీట్ల పంపకాలపై కూటమిలో అంతర్గత చర్చలు నడుస్తున్న తరుణంలో జనసేన ఈ ప్రత్యేక కమిటీని రంగంలోకి దించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రత్యేక సమన్వయ కమిటీలో APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ సభ్యులుగా నియమితులయ్యారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీ కేడర్ కు ప్రాధాన్యత ఇస్తూ.. పార్టీని బలోపేతం దిశగా పవన్ వ్యూహాత్మక నిర్ణయాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+