నాని ది ప్యారడైజ్ సినిమాపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ .. రచ్చ!

నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా పై ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ చిత్రం ప్రస్తుతం అధికార కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య పొలిటికల్ ఫైట్ కు కారణం అయ్యింది. . తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పోలిన పాత్ర ఉండటమే దీనికి కారణం.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సికింద్రాబాద్ ప్రాంతంలోని ఒక కమ్యూనిటీ గుర్తింపు పోరాటం నేపథ్యంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ తరహా పాత్రను చిత్రీకరించారు. ఆ పాత్రకు ప్రియదర్శి జీవం పోశారు. ఈ చిత్రంలో సవారీ తెగ గుర్తింపు కోసం కృషి చేయడం, అస్థిత్వ పోరాటంలో ఆయుధాలు పట్టిన వారిని శాంతి మార్గంలో నడిపించడం, స్వర్గీయ ఎన్టీఆర్‌తో కలిసి పౌరసత్వం కోసం కృషి చేయడం వంటి అనేక సన్నివేశాలు పాజిటివ్‌గా కనిపించాయి.

congress vs brs Nani The Paradise KCR with positive elevation causes the fight of congress and brs

దీనితో బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానుల్లో జోష్ పెరిగింది. కేసీఆర్‌ను నిజమైన నాయకుడిగా, తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా బ్రాండ్ చేసే ప్రయత్నాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రిలీజ్‌కు ముందు కాంగ్రెస్ శ్రేణుల్లో కొందరు ఈ సినిమాను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు. నాని పోషించిన జడల్ పాత్రను రేవంత్ రెడ్డిగా, విలన్ శిఖంజ్ మాలిక్‌ను కేసీఆర్‌గా, అతని కొడుకు విక్రమ్ మాలిక్‌ను కేటీఆర్‌గా చూసి కామెంట్లు రాశారు.

రేవంత్ రెడ్డి హీరోగా కేసీఆర్ తరహా విలన్‌ను మట్టి కరిపిస్తారని ఉత్సాహం సోషల్ మీడియాలో కనిపించింది. కాంగ్రెస్ ఈ సినిమా తమకు అనుకూలంగా ఉంటుంది అని భావిస్తే, కేసీఆర్ కు ఊహించని హైప్ ఇవ్వటంతో కాంగ్రెస్ శ్రేణులు లోలోపల మదనపడుతున్నారు. ప్రత్యేక ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ అధికారులు అనుమతి ఇచ్చారు.

రేవంత్ రెడ్డికి నాని సోషల్ మీడియా ద్వారా చేసిన రిక్వెస్ట్ నుండి ప్రస్తుతం కొనసాగుతున్న రచ్చ వరకు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.నాని టీమ్ అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తామని హామీ ఇవ్వడంతో అధికారులు ఈ ప్రత్యేక షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకరకంగా ఇది రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందని భావించారు. సెప్టెంబర్ 23న ప్రీమియర్లు ప్రదర్శించిన తర్వాత పరిస్థితి మారిపోయింది.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా టీజీ-టీమార్స్ ప్రత్యేక బ్యూరో
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా టీజీ-టీమార్స్ ప్రత్యేక బ్యూరో

సెకండ్ హాఫ్‌లో కేసీఆర్ పోలికలు ఉన్న పాత్ర హైలైట్ అయి, ఆయన ఇమేజ్‌ను పాజిటివ్‌గా చూపించటంతో కాంగ్రెస్ శ్రేణుల ప్రీరిలీజ్ ఉత్సాహం నీరుగారిపోయింది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా మలచాలని కాంగ్రెస్, కేసీఆర్ హైలెట్ అయ్యారని బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ చర్చకు కారణం అవుతుంది. సోషల్ మీడియా వేదికగా రచ్చ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+