రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా టీజీ-టీమార్స్ ప్రత్యేక బ్యూరో

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ చిరాకులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలు, హైవేలపై భద్రతా సమస్యలకు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ నిర్వహణను కేవలం చలాన్లు వేయడానికే పరిమితం చేయకుండా, శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక సాంకేతికత, ప్రమాదాలపై వేగవంతమైన స్పందనకు ప్రాధాన్యం ఇస్తూ టీజీ-టీమార్స్ తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసింది.

దీనికి సంబంధించి జీఓ 135 జారీ చేశారు. ఈ బ్యూరో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఏడీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని 32 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు, 1.8కోట్లకు పైగా వాహనాల ట్రాఫిక్ నిర్వహణపై ఈ విభాగం పర్యవేక్షణ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్న రాష్ట్ర రోడ్డు భద్రతామండలి నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం, సాంకేతిక విధానాలు, శిక్షణ, డేటా విశ్లేషణ వంటివి బ్యూరో ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి.

Telangana Launches TG-TMARS to Overhaul Traffic Management and Road-Rail Safety to reduce accidents

అత్యంత ముఖ్యమైన అంశం రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్ నియామకం. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక అధికారికి ఈ బాధ్యత అప్పగిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తరలించేలా చూస్తారు. ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, 50 కిలోమీటర్లకు పైగా ఉన్న హైవేలపై ప్రత్యేక పెట్రోలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.

వీటిలో స్పీడ్ డిటెక్టర్లు, డ్యాష్‌బోర్డ్ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వంటి పరికరాలు ఉంటాయి. ట్రాఫిక్ జరిమానాలు, కాంపౌండింగ్ ఫీజుల్లో 40 శాతం ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్‌కు మళ్లిస్తారు. ఈ నిధులను ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాలు, పెట్రోలింగ్ వాహనాలు, కంట్రోల్ రూమ్‌లు, సిబ్బంది శిక్షణ, అత్యవసర రోడ్డు పనులకు వినియోగిస్తారు.

వారిపై క్రిమినల్ కేసులు.. ఫుడ్ సేఫ్టీ అధికారుల హెచ్చరిక, 8 రెస్టారెంట్స్ లైసెన్సులు రద్దు!
వారిపై క్రిమినల్ కేసులు.. ఫుడ్ సేఫ్టీ అధికారుల హెచ్చరిక, 8 రెస్టారెంట్స్ లైసెన్సులు రద్దు!

ప్రతి కమిషనరేట్‌లో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, ప్రతి జిల్లాలో ట్రాఫిక్ అదనపు ఎస్పీ పోస్టులు ఏర్పాటు చేస్తారు. 300 పోస్టులు బ్యూరోకు బదిలీ చేస్తారు. స్టేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేసి ఆధునిక శిక్షణ ఇస్తారు. మెట్రో, రైల్వే భద్రత కూడా ఈ బ్యూరో పరిధిలోకి వస్తుంది. ఆరు నెలల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా రోడ్డు భద్రత మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+