కాంగ్రెసుతో టిడిపి కలిసి మోకాలడ్డుతోంది: కన్నా మండిపాు
గుంటూరు: తెలుగుదేశం పార్టీపై బిజెపి నేత కన్నా లక్ష్మినారాయణ తీవ్రంగా మండిపడ్డారు. మమ్మల్ని ముంచుదామనుకుని మీరు మునుగొద్దు అని ఆయన టిడిపి నేతలకు సలహా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి వెచ్చిస్తు్న ప్రతి పైసా కేంద్రం నుంచి వచ్చేందనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్ారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదాకు సాంకేతికపరమైన చిక్కులు ఉన్నందున ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని అన్నారు. అప్పుడు సిఎం చంద్రబాబు, మంత్రులు అభినందించారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నా కూడా టిడిపి దుష్ప్రచారం చేస్తోందని అన్నరు.
ఎపికి పదేళ్లలో ఇవ్వాల్సింది రెండున్నర ఏళ్లలోనే ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. మిత్రధర్మం అంటూనే బీసీ చట్టబద్ధతకు, ట్రిపుల్ తలాక్ బిల్లుకు కాంగ్రెసుతో కలిసి టిడిపి మోకాలడ్డుతోందని ఆయన అన్నారు. సోము వీర్రాజుపై దాడులు సరి కాదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications