కర్నూలులో ఫ్యాక్షన్ పడగ: కత్తితో పొడిచిన బీజేపీ నేత, టీడీపీ నేత పరిస్థితి విషమం
కర్నూలు: కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ కలకలం చోటు చేసుకుంది. శుక్రవారం తెలుగుదేశం పార్టీ నేత పుల్లారెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పుల్లారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.
పుల్లారెడ్డిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. కమీషన్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ గొడవ జరిగింది.
ఐటీడీఏ నిధుల విషయమై తలెత్తిన విభేదాల కారణంగా గొడవ రాజుకుంది. దీంతో బీజేపీ నాయకుడు.. పుల్లారెడ్డిని కత్తితో పొడిచాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ సుబ్బారాయుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications
