ఏపీలో పొత్తులపై నిర్ణయానికి వచ్చేసిన బీజేపీ..!!

ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. పొత్తుల్లో కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే తమ అభ్యర్దులను ప్రకటించాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆ రెండు పార్టీల అధినేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న బీజేపీ ఇప్పుడు ఏపీ పైన ఫోకస్ చేసింది. అభ్యర్దుల ఖరారు పైన సూచనలు చేసింది. దీని ద్వారా పొత్తుల పైన బీజేపీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

పొత్తుల లెక్కలు : ఏపీలో బీజేపీ, టీడీపీ పొత్తు పైన త్వరలోనే తేలిపోనుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం పార్లమెంట్ అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఏపీలో పొత్తుల అంశం తేల్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో పార్టీ జాతీయ నేత శివప్రకాశ్‌జీ ఏపీకి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. భేటీలో పొత్తు సహా పలు అంశాలపై చర్చించారు. పోటీకి ఆసక్తిగా ఉన్న అభ్యర్దుల అంశం పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు..సీట్ల అభ్యర్దులు..ఉమ్మడి సభ లపైన సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. పొత్తుల పైన పార్టీలో ఎలాంటి అభిప్రాయం ఉందనేది తెలుసుకున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు.

BJP leaders Foucs on AP Elections, to hold Crucial meeting over alliance with TDP and seat sharing

ఏపీ పై ఫోకస్ : మరో రెండు రోజులు విజయవాడ కేంద్రంగా శివప్రకాశ్‌జీ సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ, జనసేన నేతలు బీజేపీ తమతో కలిసి వస్తుందని చెబుతున్నారు. సీట్ల అంశం పైన చర్చ సాగుతోంది. బీజేపీ కోరిన విధంగా సీట్ల కేటాయింపు పైన కసరత్తు జరుగుతోందని పార్టీ నేతల సమాచారం. ఈ సమయంలోనే ఎంపీ అభ్యర్దులను ఖరారు చేసేందుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. 25 ఎంపీ స్థానాల నుంచి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్న వారి జాబితా..అసెంబ్లీకి పోటీ చేసే వారి జాబితా సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. పొత్తుతో వెళ్తే జరిగే ప్రయోజనం..ఒంటరిగా వెళ్లటం ద్వారా ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయనే అంశం పైన అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.

BJP leaders Foucs on AP Elections, to hold Crucial meeting over alliance with TDP and seat sharing

ఇక తేల్చేస్తారా : గతంలోనే ఈ అంశం పైన నివేదికలు సిద్దం చేసారు. ఇప్పుడు మరోసారి పొత్తుల పైనే జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలతో మంతనాలు చేయటం ద్వారా అసలు పొత్తుల పైన ఏం జరుగుతందనే చర్చ మొదలైంది. పవన్ మాత్రం ఇప్పటికీ పొత్తు ఖాయమనే విధంగా వ్యాఖ్యలు చేసతున్నారు. పొత్తుల పైన ఎవరూ మాట్లాడవద్దని రాష్ట్ర నాయకత్వానికి పార్టీ స్పష్టం చేసింది. పొత్తుల అంశం కేంద్ర నాయకత్వమే తేల్చుతుందనేది ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న మాట. ఇప్పుడు బీజేపీలో వస్తున్న కదలికతో పొత్తు ఉంటుందా లేదా అనేది సందేహంగా కనిపిస్తోంది. అయితే, ఈ మొత్తం సస్పెన్స్ కు ఒకటి , రెండు రోజుల్లోనే బీజేపీ అధినాయకత్వం తేల్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+