వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు: విభజన అంశాలపై చర్చ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో కలిశారు. ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు హాజరు కావాలని ఆయన గవర్నర్‌ను కోరారు. అలాగే, విభజన సమస్యలపైనా గవర్నర్‌తో చంద్రబాబు చర్చించారని తెలుస్తోంది.

రాష్ట్రపతిని కలవనున్న జగన్

వైసిపి అధినేత వైయసల్ జగన్ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. మంగళవారం కూడా అక్కడే పర్యటిస్తారు. వైసిపి ఎంపీలతో సహా వెళ్లి సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు.

ఢిల్లీలో అందుబాటులో ఉండే ఇతర జాతీయ పార్టీల నేతలను మంగళవారం కలుస్తారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమని పార్లమెంటు వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, ఇతర జాతీయ నేతలను కలిసి ఏపీ సమస్యను ప్రస్తావిస్తామని జగన్‌ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

పుష్పగుచ్ఛం

పుష్పగుచ్ఛం

రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు సోమవారం నాడు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

శాలువా

శాలువా

రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు సోమవారం నాడు శాలువా కప్పుతున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

పుష్కరాలకు ఆహ్వానం

పుష్కరాలకు ఆహ్వానం

రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు సోమవారం నాడు శాలువా కప్పిన అనంతరం పుష్కరాలకు ఆహ్వానం పలుకుతున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

చర్చలు

చర్చలు

రాజ్ భవన్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో పలు అంశాలపై మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

English summary
BJP plan to Andhra Pradesh development package for Navyandhra State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X