సీపీఐ నారాయణను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలి

Subscribe to Oneindia Telugu

రాజోలు: భారత ప్రధాని నరేంద్రమోడీని కాల్చిపారేయండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజి వేమ అన్నారు. భారత్‌ బంద్‌‌లో భాగంగా సిపిఐ నారాయణ ప్రధానిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాజోలు స్టోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నారాయణను వెంటనే అరెస్టు చేయాలని వారు స్టేషన్‌ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నారాయణ నల్ల కుబేరులకు మద్దతు పలుకుతున్నారని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, నారాయణను దేశద్రోహిగా గుర్తించాలని వారు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leaders protested against CPI leader Narayana.
Please Wait while comments are loading...