లోకేష్ చేతులు కాల్చుకున్న చోట పవన్ ను దింపిన బీజేపీ? ఏం జరుగుతోంది?

ఏపీలో తాజాగా తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చింది చంద్రబాబే అయినా అందులో రాజకీయంగా మైలేజ్ తెచ్చుకుంది మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయంగా, మతపరంగా సున్నిత అంశాల్ని టచ్ చేసేందుకు ఇష్టపడని చంద్రబాబు లడ్డూ వ్యవహారంలోనూ దూకుడు ప్రదర్శించలేదు. దీంతో ఆయనకు బదులు పవన్ కళ్యాణ్ లడ్డూను సనాతన ధర్మం వరకూ తీసుకెళ్లారు. అక్కడితో ఆగకుండా తమిళనాడునూ ఇందులోకి లాగుతున్నారు. దీని వెనుక బిగ్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.

లడ్డూ మైలేజ్ లాక్కున్న పవన్

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో నెయ్యి కల్తీ చుట్టూ చర్చ జరుగుతున్న వేళ రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ దాన్ని వారాహి సభ పెట్టి సనాతన ధర్మం వైపు లాగారు. దానికి గతంలో అదే సనాతన ధర్మం వైరస్ అన్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధికి లింక్ చేస్తూ విమర్శలకు దిగారు. అంతటితో ఆగకుండా జాతీయ స్ధాయిలో సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. చివరికి తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించి లడ్డూ మైలేజ్ ను పూర్తిగా తన ఖాతాలో వేసుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారు.

bjp pushing pawan kalyan in tamil politics where once nara Lokesh fails to benefit them

పవన్ వర్సెస్ ఉదయనిధి

తమిళనాడులో నిన్న మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ తాజాగా డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో వచ్చీ రాగానే ఆయన్ను సనాతన ధర్మ వ్యాఖ్యలతో టార్గెట్ చేశారు పవన్. అయితే జూనియర్ స్టాలిన్ మాత్రం ఈ విషయంలో సంయమనం పాటించారు. పవన్ వ్యాఖ్యలపై ప్రశ్నించినా లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ తప్పించుకున్నారు. తద్వారా పవన్ కు తనను టార్గెట్ చేసేందుకు మరో అవకాశం ఇవ్వలేదు.

ఎంజీఆర్, తమిళనాడుపై ప్రశంసలు

అటు ఉదయనిధిని సనాతన ధర్మం పేరుతో టార్గెట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత రూటు మార్చి తమిళనాడును, దివంగత నేత ఎంజీఆర్ ను ప్రశంసించారు. ఎంజీఆర్ 53వ జయంతి సందర్భంగా అన్నాడీఎంకేకు శుభాకాంక్షలు చెప్తున్నట్లు ట్వీట్ పెట్టిన పవన్.. అనంతరం తమిళనాడు సాదువులు, సిద్ధుల నేల అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో తన తండ్రిని కూడా లాగుతూ ఆయన గతంలో చేసిన క్రియా యోగ దీక్షను ప్రస్తావించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందన్న వాదన బలపడింది.

bjp pushing pawan kalyan in tamil politics where once nara Lokesh fails to benefit them

పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్లు

తిరుమల లడ్డూ విషయంలో పవన్ విమర్శలు మొదలుపెట్టగానే ఆయనకు కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. రోజుకో ట్వీట్ పెడుతూ డిప్యూటీ సీఎంను చికాకుపెడుతున్నారు. అంతటితో ఆగకుండా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ హాజరైన సభకు వెళ్లి మరీ ఆయన్ను, పవన్ ను పోలుస్తూ సెటైర్లు వేశారు. ఫైనల్ గా ఎంజీఆర్ పై పవన్ పెట్టిన ట్వీట్ కు స్పందిస్తూ.. ఆయనపై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో ? పై నుంచి ఆదేశాలు అందాయా జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస పంచ్ లు వేశారు.

లోకేష్ ఫెయిలైన చోట పవన్

గతంలో లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో ఎలాగైనా బోణీ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీ.. పొరుగున ఉన్న ఏపీలో ఎంతో బిజీగా ఉన్న నారా లోకేష్ ను అక్కడి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని కోయంబత్తూరులో గెలిపించేందుకు రంగంలోకి దింపారు. అన్నామలై కోసం లోకేష్ తీవ్రంగా ప్రచారం చేసినా ఆయన గెలవలేదు. దీంతో లోకేష్ కంటే పవన్ ను రంగంలోకి దించడం ద్వారా తమిళనాడులో వచ్చే జమిలి ఎన్నికల కల్లా ఉనికి చాటుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+