వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరి ఎక్కడో?: సీమాంధ్ర బిజెపి లిస్ట్, టిడిపికి చెక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

BJP Seemandhra Lok Sabha list ready!
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికలలో లోకసభ స్థానాలకు పోటీ చేయనున్న సీమాంధ్ర భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. పోటీ అంతగా లేని చోట ఒక అభ్యర్థి, పోటీ ఉన్న చోట ఇద్దరు లేదా ముగ్గురు ఆశావహులతో ఈ జాబితాను తయారు చేసింది. కొన్ని స్థానాల్లో నలుగురు అభ్యర్థులను కూడా ఎంపిక చేసింది.

ఈ జాబితాను పార్టీ పార్లమెంటరీ బోర్డు పరిశీలనకు పంపింది. ఉగాదికి ముందే అభ్యర్థులను ఫైనల్ చేసి జాబితాను ప్రకటించే అవకాశముంది. మాజీ కేంద్రమంత్రి, బిజెపి సీమాంధ్ర ప్రచార కమిటీ చీఫ్ పురంధేశ్వరికి విజయవాడ లేదా విశాఖపట్నం కేటాయించే అవకాశముందు. విశాఖ లిస్టులో హరిబాబు పేరు కూడా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే అభ్యర్థుల జాబితాలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశముంది.

టిడిపితో పొత్తు ఉండే అవకాశాలున్నాయని, ఇతర పార్టీల నేతలు పార్టీలో చేరుతారని భావిస్తున్న పార్టీ రెండు సీట్ల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీమాంధ్రలోని మొత్తం 25 లోకసభ స్థానాలకు 23 సీట్లలో అభ్యర్థుల జాబితాను తయారు చేసిన పార్టీ విజయనగరం, చిత్తూరు లోకసభ స్థానాలకు మాత్రం ఎవరినీ ఎంపిక చేయలేదు. టిడిపితో పొత్తు ఉంటే ఈ రెండు స్థానాల నుంచి ప్రముఖులు పోటీ చేసే అవకాశమున్నందునే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

హరిబాబు లేదా పురంధేశ్వరి (విశాఖ), జికె బాబు (అరకు), బాలకృష్ణ (శ్రీకాకుళం), జనార్ధన్ రావు లేదా బాలాజి (అనకాపల్లి), యువి రమణ లేదా సత్యనారాయణ (కాకినాడ), వేమా లేదా రాణా ప్రతాప్ (అమలాపురం), సత్యనారాయణ (రాజమండ్రి), రఘురా మకృష్ణం రాజు, మరో ఇద్దరు (నర్సాపురం), కోటగిరి శ్రీధర్ (ఏలూరు), సురేష్ రెడ్డి (నెల్లూరు), బాడిగ రామకృష్ణ (మచిలీపట్నం), పురంధేశ్వరి లేదా యెర్నేని సీతాదేవి (విజయవాడ)లు లిస్టులో ఉన్నారు.

తిరుపతికి నలుగురు, ఒంగోలు, రాజంపేట, కడప, హిందూపురం, గుంటూరు, కర్నూలు, నర్సారావుపేటలకు ఇద్దరు చొప్పున, అనంతపురంకు ముగ్గురు, బాపట్ల, నంద్యాలల నుండి ఒక్కరు చొప్పున లీస్టులో ఉన్నారు.

కాగా, టిడిపితో పొత్తుల విషయంలో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు తుదివిడత చర్చలకు సన్నద్ధమవుతూనే మరోపక్క సీమాంధ్రలో 23 లోకసభస్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాపై లీకులు ఇచ్చిందంటున్నారు. పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారయణ బిజెపిలో చేరుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాకు సంబంధించిన ఆ«శావహుల వివరాలను వెల్లడించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.తద్వారా టిడిపిపై ఒత్తిడి పెంచుతోంది.
టిడిపితో పొత్తుకు సంబంధించి బిజెపి తుదివిడత యత్నాలను ప్రారంభించిందని తెలిసింది. ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ హైదరాబాద్ వస్తున్నారు. గురువారం ఆయన తెలుగుదేశం నేతలతోచర్చించే అవకాశాలున్నాయి. అయితే తెలంగాణలో బిజెపి నేతలు, సీమాంధ్రలో ఆర్ఎస్సెస్ తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.

English summary
Bharatiya Janata Party Seemandhra Lok Sabha list almost ready.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X