రూటు మార్చారు: నల్లధనం మార్చుకునేందుకు నాయకుల సరికొత్త ఎత్తు
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనం ఉన్న వారు నిన్నటి దాకా బంగారు ఆభరణాలు కొని దాచుకున్నారు. బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్రభుత్వం నిఘా వేసింది. దీంతో బ్లాక్ మనీ ఉన్న వారు, రాజకీయ నాయకులు కొత్త ఎత్తులు వేస్తున్నారు.
నిన్నటి దాకా బ్లాక్ మనీ ఉన్న వారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి, వైట్‌గా మార్చుకునే ప్రయత్నం చేశారు. అలాగే, తన వద్ద ఉన్న డబ్బును పేదవారికి ఇచ్చి, వారి బ్యాంకు అకౌంట్లలో వేసి వారికి కొంత ఎరవేసి మిగతా డబ్బును తెల్లగా మార్చుకున్నారు. త్వరలో ఎన్నికలు ఉన్న రాష్ట్రాలలో ముందుగానే ఓటుకు నోటుగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా, నల్ల డబ్బును డాలర్లతో మార్చుకుంటున్నారని తెలుస్తోంది. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని దాచుకునేందుకు వివిధ పలు ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న పెద్ద నోట్లతో అమెరికన్ డాలర్లను సమకూర్చుకుంటున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు.

నోట్ల రద్దుపై కేంద్రం నిర్ణయం వెలువడిన వెంటనే తొలి మూడు, నాలుగు రోజులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేశారు. దీంతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకూ రూ.30వేల వరకూ ఉన్న 10 గ్రా. బంగారం ధర ఒకటిన్నర రెట్లు పెరిగింది.
దీంతో ఆదాయపు పన్ను శాఖ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నోటీసులు జారీ చేయటంతో కొనుగోలుదారుల్లో ఆందోళన మొదలైంది. ఐటీ శాఖ నిఘా పెట్టడంతో అమెరికన్ డాలర్ల వైపు మొగ్గు చూపుతున్నారట. దీంతో అధిక శాతానికి డాలర్ విక్రయం అవుతోందని అంటున్నారు. నల్లకుబేరులు అక్రమమార్గాల్లో ఒక్కో డాలరును రూ.95 నుంచి రూ.వంద వరకు చెల్లించి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోందని అంటున్నారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా బ్లాక్ మనీ ఉన్న పలువురు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సహకార బ్యాంకుల్లోని లోపాలను తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారట.
పూర్తిగా కంప్యూటీకరణ కానీ సహకార బ్యాంకులు, ఇప్పటికీ ఫిజికల్ లెడ్జర్ బుక్స్ ద్వారానే కార్యకలాపాలు చేస్తున్నాయి. వీటీని నల్ల కుబేరులు అవకాశంగా మార్చుకుంటున్నారని తెలుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాజకీయ నాయకులు కూడా దీనిని ఫాలో అవుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications