Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలుడు: 18కి చేరిన మృతులు, నేడు సీఎం పర్యటన

విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో బుధవారం చోటు చేసుకున్న ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రియాక్టర్ పేలుడు ఘనలో మృతుల సంఖ్య 18కి చేరింది. మరో 50 మందకిపైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. దట్టంగ పొగ అలుముకుని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడుధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడుతో భయపడిపోయిన మిగితా కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.

Blast in Atchutapuram pharma SEZ death toll to 18 CM babu orders probe

ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో రెండో షిప్టులోని దాదాపు 380 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబు మొత్తం కూలిపోయింది. ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు కార్మికులు చెప్పడతో క్రేన్ సాయంతో వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురుని సురక్షితంగా బయటికి తీశారు. ఎన్డీఆర్ఎప్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

కాగా, ఫార్మా సెజ్‌లోని ఫైరింజిన్లతోపాటు మరో 11 ఫైరింజిన్ల బయట నుంచి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. క్షతగాత్రులను హుటాహుటిన అనకాలపల్లిలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలిన గాయాలతో కొందరు మృతి చెందగా.. మొదటి అంతస్తు శ్లాబ్ నుంచి దూకి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

నేడు బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు

అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గురువారం అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

ఈ ఘటనపై హెల్త్ సెక్రటరీ, సెక్రటరీ ఇండస్ట్రీస్, డైరెక్టర్ ఫ్యాక్టరీస్, కమిషనర్ లేబర్, డైరెక్టర్ బాయిలర్స్, ఎస్డీఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారుతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారికి సూచనలు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 41 మందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రమద ఘటనలో 10 మంది మృతుల గుర్తింపు

1. వి. సన్యాసినాయుడు (50), ప్లాంట్ ఏజీఎం
2. రామిరెడ్డి, ల్యాబ్ హెడ్
3. హారిక కెమిస్ట్
4. పార్థసారథి(23), ప్రొడక్షన్ ఆపరేటర్
5. వై. చిన్నారావు, ప్లాంట్ హెల్పర్
6.పి.రాజశేఖర్ (22)
7. మోహన్, ఆపరేటర్
8. గణేష్, ఆపరేటర్
9. హెచ్. ప్రశాంత్
10. ఎం. నారాయణరావు.

మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి: జగన్ డిమాండ్

సెజ్ ప్రమాద ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం బాధకు గురిచేసిందన్నారు. మరణించినవారి కుటుంబాలకు ప్రగాడ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి ఉచిత చిత్స అందించడంతోపాటు వారు కోలుకునేంత వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితుకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. ప్రమాదంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వం అండగా ఉంటుంది: గవర్నర్

సెజ్ ప్రమాద ఘటనపై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్‌ పేలి పలువురు కార్మికులు మృతిచెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. మరోవైపు, ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+