నిమ్స్ ఆస్పత్రికి బాంబు బెదిరింపు: రూ.50 ఇవ్వాలని..

దీంతో అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్‌తో నిమ్స్ పార్కింగ్ స్థలంలో, ఆరోగ్యశ్రీ ఓపి విభాగం వద్ద పలు ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఆకతాయి పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇలాంటి ఆకతాయిల చేష్టలతో పోలీసులు విలువైన సమయం వృథా కావడంతో పాటు, రోగులు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదముందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications