ఛాన్స్ ఇస్తే తునిలో ఏం చేశారో ఆలోచించండి
విజయవాడ: ఏపీలో స్వేచ్ఛ లేదంటూ వ్యాఖ్యలు చేసిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. ముద్రగడ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, ఒకసారి స్వేచ్ఛ ఇస్తే తునిలో ఏం చేశారో ముద్రగడ ఆలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. కోర్టు ఆదేశాల ప్రకారమే పోలీసులు వ్యవహరించారని, ఇప్పటివరకు మంజునాథ కమిషన్ ను ముద్రగడ ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications