కాల్‌మనీ దందాలో కొత్తకోణం: వ్యభిచారం రొంపిలోకి, బ్లూఫిల్మ్‌లు తీసి అమ్ముకుంటున్నారు
అమరావతి: విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యాపారంపై బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిక వడ్డీలకు అప్పులిస్తూ, రుణ వసూళ్లలో బాధితులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కాల్‌మనీ వ్యాపారులకు అప్పులు చెల్లించవద్దని నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
కాల్‌మనీ వ్వవహారంపై శనివారం ఆయన స్థానిక మీడియాలో మాట్లాడిన ఆయన తీసుకున్న అప్పుల్లో చిల్లిగవ్వ కూడా చెల్లించవద్దని పేర్కొన్నారు. కాల్ మనీ వ్యాపారుల బెదిరింపులకు ఏమాత్రం బెదరవద్దని కూడా ఆయన సూచించారు. కాల్ మనీ వ్యాపారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
ఖద్దరు ముసుగులో సాగిస్తున్న ఈ కాల్ మనీ వ్యాపారుల దారుణాలు కలకలం రేపుతున్నాయి. ఈ దందాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కాల్‌మనీ నిందితుడితో ఓ ఎమ్మెల్యే సింగపూర్‌లో జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కాల్‌మనీ వ్యవహారంలో వందలకోట్ల రూపాయల బ్లాక్‌మనీ వైట్ మనీగా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ ట్రస్ట్ పేరుతో ఈ కాలీ మనీ దందాను వ్యాపారులు ప్రారంభించారు. ముందు మహిళలను మచ్చిక చేసుకుని గిప్టులిస్తారు. ఆ తర్వాత వారికి 5 రూపాలయల వడ్డీకే అప్పలిస్తారు.
ఈ అప్పులు తీర్చిన తర్వాత 5 నుంచి 25 రూపాయల వరకు వడ్డీని అమాంతం పెంచేస్తారు. కాల్‌మనీ సభ్యులకు రాజకీయ నాయకుల నుంచే బ్లాక్‌మనీ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ఎమ్మెల్యే రూ. 10 కోట్ల పెట్టుబడి పెట్టి ఒక నెలలోనే రూ. 10 లక్షల వడ్డీని లాగుతున్నాడంటే ఈ కాల్‌మనీ దందా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోండి.
బెజవాడ వన్‌టౌన్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు ఈ కాల్‌మనీ దందాలో వందలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్ మనీ ఘటనలో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కాల్‌మనీ ముఠా సభ్యులు కాకులపాడు రైస్ మిల్లులో పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ పేకాట స్థావరంలో హనుమాన్ జంక్షన్ పోలీసుల హస్తం ఉన్నట్లుగా టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కాల్ మనీ దందాలో సాక్ష్యాత్తూ ఎలక్ట్రికల్ డీఈ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోయంబత్తూర్ నుంచి వచ్చిన నకిలీ నోట్లను ఈ కాల్ మనీ సభ్యులు మార్పిడి చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల పేకాట స్థావరంలో ఒక్క సింగిల్ టేక్‌లోనే రూ. లక్ష వరకు ఆట ఆడుతున్నట్లు పోలీసులు దాడుల్లో తెలిసింది. అధిక వడ్డీ రేట్లకు అప్పులు ఇవ్వడంతో పాటు తిరిగి చెల్లించలేని బాధితులను వ్యభిచారం రొంపిలోకి సైతం దించేందుకు ఈ కాల్ మనీ ముఠా సభ్యులు ఏ మాత్రం వెనుకాడటం లేదు.
వ్యభిచారం రొంపిలోకి దించిన తర్వాత బాధితులను వీడియోలు తీసి బెదిరిస్తున్నారు. ఈ వీడియోలను బ్లూ ఫిల్మ్‌ల రూపంలో అమ్ముకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటువంటి 35 వీడియోలను ఇప్పటివరకు కాల్ మనీ ముఠా సభ్యుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్‌మనీ దందాతో వందలాది మంది బాధితులు లబోదిబో మంటున్నారు.












Click it and Unblock the Notifications