వీరితో ఎందుకు, వేస్ట్: ముఖ్యమంత్రితో బొత్స రుసరుస
న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం కొందరు విలేకరుల పైన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మండిపడగా.. తాజాగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా ఆయన విలేకరులపై మండిపడ్డారు!
శనివారం కిరణ్ మొదట విలేకరులతో మాట్లాడారు. అనంతరం కొందరు విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సమయంలో బొత్స అక్కడకు వచ్చారు. కిరణ్ విలేకరులతో మాట్లాడుతుండటాన్ని చూసి.. వాళ్లతో ఎందుకు మాట్లాడుతున్నారని, వేస్ట్ అని వ్యాఖ్యానించారట.

కిరణ్ సమావేశం అనంతరం బయటకు వచ్చిన విలేకరులు అలా ఎందుకన్నారని ప్రశ్నిస్తే.. నా నోరు నా ఇష్టం అని వ్యాఖ్యానించారట. అంతేకాకుండా మీరు కూడా ఇష్టం వచ్చింది రాసుకోండని చెప్పడమే కాకుండా, తాను సిఎం ముందు మిమ్మల్ని అన్నప్పుడు అక్కడే అడగాలి కదా అని ప్రశ్నించారట.
కాగా, లగడపాటి నాలుగు రోజుల క్రితం తెలంగాణ జర్నలిస్టులపై నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. వారిని తీవ్రంగా హెచ్చరించారు కూడా. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి (జివోఎంకు) నివేదిక వంపడానికి ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులు కొంత మంది ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. జర్నలిస్టుల ప్రశ్నలతో లగడపాటి అసహనానికి గురయ్యారు. ప్రశ్నలు వేసిన పత్రికా రచయితలపై రుసరుసలాడారు. అవసరమైతే చేయి చేసుకుంటానని హెచ్చరించారు. మీ అంతు చూస్తానంటూ ఆగ్రహంతో రెచ్చిపోయారు. దీంతో అక్కడున్నవారు జోక్యం చేసుకుని లగడపాటిని పక్కుకు తీసుకుని వెళ్లారు.












Click it and Unblock the Notifications